»Kerala Court Cancels Cpim Mlas Election From Reserved Devikulam Seat
Kerala High Court: మతాన్ని దాచి… కాంగ్రెస్ నేత పిటిషన్, సీపీఎం ఎమ్మెల్యే ఎన్నిక రద్దు
2021 కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్డ్ దేవీకులం అసెంబ్లీ నియోజకవర్గం నుండి సీపీఎం తరఫున రాజా గెలిచాడు. అయితే ఆయన హిందువు కాదని, క్రైస్తవుడు అని, ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో పోటీ ఎలా చేస్తారని కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన అభ్యర్థి కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ ను విచారించిన కేరళ హైకోర్టు.. దేవీకులం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను రద్దు చేసి, ఎమ్మెల్యే రాజా ఎన్నికపై అనర్హత వేటు వేసింది.
2021 కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్డ్ దేవీకులం అసెంబ్లీ నియోజకవర్గం నుండి సీపీఎం తరఫున రాజా గెలిచాడు. అయితే ఆయన హిందువు కాదని, క్రైస్తవుడు అని, ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో పోటీ ఎలా చేస్తారని కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన అభ్యర్థి కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ ను విచారించిన కేరళ హైకోర్టు.. దేవీకులం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను రద్దు చేసి, ఎమ్మెల్యే రాజా ఎన్నికపై అనర్హత వేటు వేసింది. రాజా క్రైస్తవుడని, ఎస్సీ వర్గానికి రిజర్వ్ చేయబడిన దేవీకులం స్థానంలో పోటీ చేసే అర్హత లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకుడు డి కుమార్ పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు పై విధంగా తీర్పు చెప్పింది.
రాజా క్రిస్టియన్ అని, కొండ జిల్లాలోని ఒక చర్చిలో బాప్టిజం పొందాడని, కానీ అతను ఎస్సీ వర్గానికి చెందిన వాడని నిరూపించేందుకు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించాడని కాంగ్రెస్ రన్నరప్ కుమార్ తన పిటిషన్ లో ఆరోపించారు. క్రైస్తవ మార్గంలో రాజా పెళ్లి, ఆయన క్రైస్తవ విశ్వాసాన్ని సూచించే పలు సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు కుమార్. రాజా మట్టుపెట్టి కుండల ఈస్ట్ డివిజన్ లో ఆంటోనీ, ఎస్తేర్ అనే దంపతులకు జన్మించినట్లు తన పిటిషన్ లో పేర్కొన్నారు. రాజా తల్లికి వారి ఆచారం ప్రకారమే అంత్యక్రియలు జరిగాయని, కుటుంబం క్రమం తప్పకుండా చర్చికి వెళ్తోందని వాదించారు.
2021లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కుమార్ పైన సీపీఎం నుండి పోటీ చేసిన రాజా 7848 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాజా పైన ఎమ్మెల్యే అనర్హత వేటు వేయడంతో కేరళ అసెంబ్లీలో సీపీఎం సభ్యుల సంఖ్య 62 నుండి 61కి తగ్గింది. అధికార ఎల్డీఎప్ కూటమికి రాష్ట్ర అసెంబ్లీలో 90కి పైగా సభ్యుల మద్దతు ఉంది. కేరళ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా తమిళంలో ప్రమాణ స్వీకారం చేసేందుకు ముందుకు వచ్చిన రాజా తద్వారా వార్తల్లో నిలిచారు. దేవీకులం నియోజకవర్గంలో తమిళ ఓటర్లు 62 శాతం వరకు ఉంటారు. మెజార్టీ ఓటర్లలో పల్లార్, పరయ వర్గాలకు చెందిన వారు.