బెంగుళూరులో ట్రాఫిక్ ను ఉల్లంఘించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అందుకే ఎక్కడ చూసిన ట్రాఫిక్ పోలీసుల కంటే కెమెరా కళ్లే ఎక్కువ. చిన్న చిన్న ఉల్లంఘనలకు కూడా పోలీసులు జారిమానా విధిస్తున్నారు. ఎంతో మంది రైడర్ల వాహనలపై వేల రూపాయల ఫైన్ చెల్లించాల్సి ఉంది. అలా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన రైడర్లకు ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పింది.. అదేంటంటే..జరిమానా బకాయిలు చెల్లించినట్లయితే, 50శాతం తగ్గింపును ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సంబంధించి 27-01-23న న్యాయసేవా అథారిటీ చైర్మన్గా ఉన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. వీరప్ప నేతృత్వంలో సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా జరిమానా తగ్గించాలని రవాణా, రోడ్డు భద్రత కమిషనర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 11 వరకు మాత్రమే ఈ మినహాయింపు వర్తించనుంది.. జరిమానా కట్టలేని వారికి 50% మినహాయింపు ఇవ్వడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక అంతటా ఉల్లంఘించినవారు ట్రాఫిక్ పోలీసు విభాగానికి సుమారు ₹ 530 కోట్ల అపరాధ రుసుము చెల్లించాల్సి ఉందని, ఇందులో ₹ 500 కోట్ల రూపాయలు రాష్ట్ర రాజధాని బెంగళూరు నుండి రావాల్సి ఉందని సీనియర్ IPS అధికారి తెలిపారు .