»Abp Cvoter Karnataka Opinion Poll Projects Congress Win
Karnataka Opinion Poll: కర్నాటకలో బీజేపీకి షాక్, కాంగ్రెస్ గెలుస్తుందన్న సర్వే
కర్నాటకలో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయని ఏపీబీ - సీ వోటరు ముందస్తు ఎన్నికల సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధరామయ్య వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీకి (Bharatiya Janata Party) షాక్ తప్పదని ఏబీపీ – సీ వోటరు (ABP – C Voter) ముందస్తు ఎన్నికల సర్వే ఫలితాలు (kanrataka assembly elections 2023) చెబుతున్నాయి. కాంగ్రెస్ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వే ఫలితాలు వెల్లడించాయి. ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీకి (Congress party win) 115 నుండి 127 సీట్లు, బీజేపీకి (BJP win) 68 నుండి 80 సీట్లు వచ్చే అవకాశముంది. కింగ్ మేకర్ ఆశలు పెట్టుకున్న జేడీఎస్ కు (JDs) మాత్రం 23 నుండి 35 సీట్లు రావొచ్చునని తెలిపింది. ఇతరులు రెండు స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా కర్నాటకలో గత కొద్ది దశాబ్దాలుగా ఏ పార్టీ కూడా రెండోసారి అధికారంలోకి రాలేదు. ఇప్పుడు కూడా ఇదే ఆనవాయితీ కనిపిస్తోంది. ఈసారి బీజేపీ ఓడిపోయి, కాంగ్రెస్ గెలిస్తే ఆనవాయితీ కనిపించినట్లు. బీజేపీ రెండోసారి గెలిస్తే మాత్రం అది రికార్డ్ అవుతుంది.
ఏబీపీ – సీ వోటరు సర్వే (ABP – C Voter Survey) ప్రకారం… యాభై శాతం మంది ప్రజలు ప్రస్తుత ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. 28 శాతం మంది మాత్రమే బాగుందని చెప్పారు. నిరుద్యోగం పట్ల 29 శాతం మంది, ఆ తర్వాత మౌలిక సదుపాయాల పట్ల 21 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయానికి వస్తే సిద్ధరామయ్యకు 39 శాతం మంది జై కొట్టారు. రెండో స్థానంలో బీజేపీ నేత బసవరాజు బొమ్మై 31 శాతంతో ఉన్నారు. జేడీఎస్ నేత కుమారస్వామికి 21.4 శాతం, కాంగ్రెస్ నేత డీకే కుమారస్వామికి 3.2 శాతం మద్దతు లభించింది. 224 సీట్లకు గాను 2008లో కాంగ్రెస్ 80 స్థానాలు, 2013లో 122 స్థానాలు, గత ఎన్నికల్లో మళ్లీ 80 సీట్లకు పడిపోయింది. బీజేపీ కీలక నేత యెడ్యూరప్ప తనకు 80 ఏళ్లు దాటాయని, అందుకే పోటీ నుండి తప్పుకున్నట్లు చెప్పారు. కానీ పార్టీ కోసం రాష్ట్రమంతా తిరుగుతానని చెప్పారు.
కర్నాటకలో హైదరాబాద్ రీజియన్ కర్నాటకలో 31, ముంబై కర్నాటకలో 50 సీట్లు, కోస్టల్ కర్నాటకలో 21 సీట్లు, సెంట్రల్ కర్నాటకలో 35 సీట్లు, ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో 55 సీట్లు ఉన్నాయి.
హైదరాబాద్ రీజియన్ లో కాంగ్రెస్ 19 – 23, బీజేపీ 8 – 12 సీట్లు, ముంబై కర్నాటక ప్రాంతంలో కాంగ్రెస్ 25 – 29, బీజేపీ 21 – 25, కోస్టల్ కర్నాటకలో కాంగ్రెస్ 8 – 12, బీజేపీ 9 – 13, సెంట్రల్ కర్నాటకలో కాంగ్రెస్ కు 18 – 22, బీజేపీకి 12 – 16 సీట్లు, ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో కాంగ్రెస్ కు 24 – 28, బీజేపీకి 26 – 27, అర్బన్ బెంగళూరులో కాంగ్రెస్ కు 15 – 19, బీజేపీకి 11 – 15 సీట్లు వచ్చే అవకాశముంది. హైదరాబాద్, ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో బీజేపీకి గట్టి దెబ్బ కనిపిస్తోంది. ఇక జేడీఎస్ 26 నుండి 27, బెంగళూరులో 1 – 3, సెంట్రల్ కర్నాటకలో 1 – 2 గెలుచుకోవచ్చు.