Rahul Gandhi disqualification: వాయనాడ్‌కు ఉప ఎన్నికలు జరుగుతాయా?
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పైన అనర్హత వేటు పడిన (Rahul Gandhi disqualification) నేపథ్యంలో కేరళలోని వాయనాడ్ (Kerala Wayanad bypolls) లోకసభకు (Lok Sabha) ఉప ఎన్నిక జరుగుతుందా (Wayanad Bypoll) అనే చర్చ సర్వత్రా సాగుతోంది.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత (Congress Leader) రాహుల్ గాంధీ పైన (Rahul Gandhi) అనర్హత వేటు పడిన (Rahul Gandhi disqualification) నేపథ్యంలో కేరళలోని వాయనాడ్ (Kerala Wayanad bypolls) లోకసభకు (Lok Sabha) ఉప ఎన్నిక జరుగుతుందా (Wayanad Bypoll) అనే చర్చ సర్వత్రా సాగుతోంది. ప్రధాని మోడీని (Narendra Modi) విమర్శించే క్రమంలో రాహుల్ గాంధీ… మోడీ అనే ఓబీసీ కులాన్ని మొత్తం విమర్శించారు. దీంతో గుజరాత్ కు చెందిన ఆ వర్గానికి చెందిన ఎమ్మెల్యే సూరత్ కోర్టులో (Surat Court) పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం, రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ వెంటనే బెయిల్ మంజూరు చేసింది. అయితే చట్టం ప్రకారం రెండేళ్లు, అంతకంటే ఎక్కువ శిక్ష పడితే చట్టసభ సభ్యుల సభ్యత్వం రద్దవుతుంది. దీని ప్రకారం లోకసభ సచివాలయం (lok sabha secretariat) ఆయన లోకసభ సభ్యత్వాన్ని రద్దు చేసింది. 2019లో రాహుల్ గాంధీ (Rahul Gandhi) రెండు చోట్ల నుండి పోటీ చేశారు. అమేథిలో (Amethi) బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ (Union Minister smriti irani) చేతిలో ఓడిపోతానని ముందే గ్రహించిన ఈ కాంగ్రెస్ అగ్రనేత కేరళలోని వాయనాడ్ (Wayanad elections) నుండి కూడా పోటీ చేసారు. అనుకున్నట్లుగానే అమేథిలో ఓడిపోయి, వాయనాడ్ లో గెలిచారు. ఇప్పుడు అనర్హత వేటు పడటంతో వాయనాడ్ కు ఉప ఎన్నిక చర్చనీయాంశంగా మారింది.
కేంద్ర ఎన్నికల సంఘం (election commission of india) ముందు మూడు ఆప్షన్స్ ఉన్నాయి. అందులో 1 … పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ 1951 సెక్షన్ 151ఏ ప్రకారం ఆరు నెలల్లో వాయనాడ్ ఉప ఎన్నికలు నిర్వహించాలి. 2 … 2024 లోకసభ ఎన్నికల వరకు వేచి చూడటం. అయితే సార్వత్రిక ఎన్నికలకు ఏడాది లోపు సమయం ఉంటే మాత్రమే ఇది జరుగుతుంది. 3 … ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు రాహుల్ కు అప్పీల్ దాఖలు చేసుకునే అవకాశం కల్పించడం. కోర్టుకు వెళ్లి, స్టే తెచ్చుకోవడం వంటి అంశాలు ప్రభావం చూపుతాయి. కాబట్టి ఈసీ ఎం చేస్తుందనేది ఆసక్తికరమే. అయితే నేడు కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వాయనాడ్ ఉప ఎన్నిక పైన ఎన్నికల సంఘం నుండి దాదాపు క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ వలె.. గతంలో శిక్ష పడిన లాలూ ప్రసాద్, జయలలిత పదవులపై కూడా వేటు పడింది. రెండు నెలల క్రితం లక్షద్వీప్ ఎంపీ సభ్యత్వం కూడా రద్దయింది. అయితే ఆయన కోర్టుకు వెళ్లారు. దీంతో అందరి దృష్టి లక్షద్వీప్ ఎంపీ పిటిషన్ పైన కూడా ఉంది. కోర్టులో సదరు ఎంపీకి ఊరట దక్కితే రాహుల్ కు వెసులుబాటు దొరుకుతుంది. లేదంటే వాయనాడ్ ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.
వాయనాడ్ లేదు..
కేంద్ర ఎన్నికల సంఘం మధ్యాహ్నం కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇందులో వాయనాడ్ ఉప ఎన్నిక లేదు. అదే సమయంలో లక్షద్వీప్ ఎంపీ ఫైజల్ అనర్హత వేటును లోకసభ సచివాలయం ఎత్తివేసింది. దీంతో ఆయన మళ్లీ ఎంపీగా లోకసభలోకి రావొచ్చు. అయితే తన అనర్హత పైన ఆయన కోర్టుకు వెళ్లి, ఊరట పొందారు. రాహుల్ గాంధీ కూడా తన మీద అనర్హత వేటు పైన కోర్టుకు వెళ్లవచ్చు. మొత్తానికి ఇప్పటికి అయితే వాయనాడ్ ఉపఎన్నిక లేదని ఈసీ ప్రకటన ద్వారా తెలిసిపోయింది. రాహుల్ కోర్టుకు వెళ్తారా.. వెళ్తే అక్కడ ఏం జరుగుతుందనే అంశాన్ని బట్టి తదుపరి ఆధారపడి ఉంటాయి.