సూర్య హీరోగా కంగువ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తుండగా కేఈ జ్ఞానవేళ్ రాజా నిర్మిస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘నేను సాధారణంగా నా సినిమాలను చూసిన తర్వాత హీరోలకు ముందుగా లోపాలను చెబుతాను. కానీ కంగువ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత నేను ఆశ్చర్యపోయా. సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చింది’ అని చెప్పుకొచ్చాడు.