తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి, డైరెక్టర్ హెచ్.వినోద్ కాంబోలో ‘దళపతి 69’ అనే వర్కింగ్ టైటిల్‌తో మూవీ రాబోతుంది. ఇదే విజయ్ చివరి సినిమా అని, దీని తర్వాత ఆయన రాజకీయాల్లో బిజీ అవుతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ అట్లీతో విజయ్ సినిమా చేయనున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.