లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ తేజస్విని పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ ఇంటర్వ్యూలో ‘మీ జీవితంలో ఎక్కువగా దేనికి భయపడతారు’? అని ప్రశ్నించగా.. తేజస్విని సమాధానమిస్తూ.. తనకు పెళ్లంటే చాలా భయమని అందుకే లైఫ్లో పెళ్లి చేసుకోవద్దని ఫిక్స్ అయ్యానని తెలిపింది. అలాగే పెళ్లి చేసుకోను కానీ పిల్లలను కంటానని చెప్పింది. దానికి ఇంకా ఐదేళ్ల సమయం ఉందంటూ వెల్లడించింది.