పవన్ కళ్యాణ్ పై దర్శకుడు కృష్ణవంశీ ప్రశంసలు కురిపించారు. ఎక్స్ వేదికగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. ‘మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై నాకు ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయి. అవినీతిమయంగా మారిన రాజకీయాల్లో ఓ వ్యక్తి విలువలు, విశ్వాసాలు నింపేందుకు కష్టపడుతున్నాడు. భగవంతుడు ఆయనకు ఎప్పుడూ అండగా ఉండాలని కోరుకుంటున్నా. పవన్ రియల్ లైఫ్ హీరో’ అని అన్నారు.