స్టార్ హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘పుష్ప 2’. డిసెంబర్ 5న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రెస్మీట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేస్తున్నామని, నవంబర్‌లో ‘పుష్ప 2’ మేనియా కొనసాగుతుందని వెల్లడించారు. ఆ నెలలోనే మూవీ నుంచి రెండు పాటలతో పాటు ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేస్తామని తెలిపారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.