జూ.ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ మూవీ భారీ విజయం సాధించింది. అయితే ఈ మూవీలో వర్క్ చేసిన ఓ ఆర్టిస్ట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ‘దేవర’ పార్ట్-2లో ‘వర’తో పాటు దేవర కూడా కనిపించే అవకాశం ఉందేమో.. అంతే కాకుండా పార్ట్-2లో ఇద్దరే కాకుండా ముగ్గురు ఎన్టీఆర్లు కూడా ఉండొచ్చేమో అంటూ కామెంట్ చేశాడు.