కన్నడ స్టార్ నటుడు కిచ్చా సుదీప్ తల్లి సరోజ చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెను తలుచుకుంటూ సుదీప్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఆమె స్పృహలో ఉన్నప్పుడు చూడలేకపోయానని బాధపడ్డారు. ‘ఆమె నా గురువు. దేవత. కానీ ఇప్పుడు ఆమె జ్ఞాపకంగా మారిపోయింది. నేను పడుతున్న బాధను బయటకి చెప్పలేకపోతున్నా. నా జీవితంలో అత్యంత విలువైంది కోల్పోయాను’ అంటూ పోస్ట్ పెట్టారు. ఈ మేరకు తన తల్లితో దిగిన ఫొటోను షేర్ చేశారు.