నటి రష్మికా మందన్న వరుస మూవీలతో బిజీగా ఉన్నారు. తాజాగా బాలీవుడ్లో ఆమె మరో సినిమాకు ఓకే చెప్పారు. ఈ మూవీకి ‘థమా’ అనే టైటిల్ పెట్టారు. ఈ విషయాన్ని రష్మిక సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ సినిమాను ఆదిత్య సర్పోత్థార్ తెరకెక్కిస్తుండగా.. ‘స్త్రీ’ నిర్మాత దినేష్ విజన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేష్ రావల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2025, దీపావళికి ఇది విడుదలవుతుంది.