సినీనటి అనన్య నాగళ్ళ మల్లేశం సినిమాతో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. తాజాగా ‘పొట్టేల్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఈ బ్యూటీ సినీ పరిశ్రమకు రాకముందు ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ జాబ్ చేసినట్లు తెలిపింది. హీరో యువచంద్ర కూడా అక్కడే పనిచేసేవాడు. అతడు షార్ట్ ఫిలిమ్స్ తీస్తుంటే చూసి తనకు సినిమాలపై ఆసక్తి కలిగిందని ఆమె వెల్లడించింది. ఒకప్పటి కొలీగ్తో హీరోయిన్గా చేయడం సంతోషంగా ఉందని పేర్కొంది.