కెరటంలా పడి లేవడం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు కొత్తేం కాదు. అయితే మొత్తం పోగొట్టుకొని.. మళ్లీ రికవరీ అయిన పూరిని లైగర్ తీవ్ర నిరాశకు గురి చేసింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించిన లైగర్ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు పూరి. కానీ సాలా క్రాస్ బ్రీడ్ సక్సెస్ కాలేకపోయాడు. దాంతో డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ కూడా ఆగిపోయింది. మొత్తంగా పూరి మళ్లీ మొదటికొచ్చాడని అంటున్నారు. అసలు ఇప్పట్లో పూరికి డేట్స్ ఇచ్చే హీరోలు లేరనే ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు తనతో సినిమా చేయమని వెంటబడ్డ హీరోలు సైతం.. ఇప్పుడు పూరికి మొహం చాటేస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పూరి నెక్ట్స్ హీరో ఎవరనేది ఆసక్తికరంగా మారింది.
కానీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న ప్రకారం ముగ్గురు హీరోల్లో ఎవరో ఒకరితో పూరి సినిమా ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ పూరికి ఛాన్స్ ఇవ్వనున్నాడని వినిపిస్తోంది. ‘పైసా వసూల్’ తర్వాత మళ్లీ కలిసి పని చేయాలని అనుకున్నారు బాలయ్య-పూరి. కానీ ఎప్పటిలాగే మిగత కమిట్ మెంట్స్ కారణంగా ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అయ్యేట్టు లేదు. దాంతో పూరీ తన కొడుకు ఆకాష్‌తో ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. అలాగే ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో ‘ఇస్మార్ట్ శంకర్ 2’ చేసే అవకాశం ఉందంటున్నారు. ఎటు చూసిన ప్రస్తుతానికైతే పూరి ముందు ఈ ముగ్గురు హీరోలు మాత్రమే ఉన్నారని చెప్పొచ్చు. మరి పూరి హీరో ఎవరనేది తెలియాలంటే.. పూరి చెప్పేవరకు వెయిట్ చేయాల్సిందే.