NTR 31 : ట్రిపుల్ ఆర్ తర్వాత సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివతో ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను సముద్రం బ్యాక్ డ్రాప్లో భారీ బడ్జెట్‌తో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలె రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు తారక్.
ట్రిపుల్ ఆర్ తర్వాత సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివతో ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను సముద్రం బ్యాక్ డ్రాప్లో భారీ బడ్జెట్‌తో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలె రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు తారక్. ప్రజెంట్ ప్రభాస్‌తో సలార్ మూవీ తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. సలార్ అయిపోయిన వెంటనే ఎన్టీఆర్ 31ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు ఊహించని విధంగా.. హృతిక్ రోషన్‌తో కలిసి బాలీవుడ్ భారీ ప్రాజెక్ట్ ‘వార్ 2’ ని లైన్లో పెట్టాడు ఎన్టీఆర్. దీంతో వార్ 2 తర్వాతే ఎన్టీఆర్ 31 ఉంటుందని తెలుస్తోంది. కానీ ఓ మాస్టర్ ప్లాన్‌తో యంగ్ టైగర్ వార్2ని కంప్లీట్ చేయబోతున్నాడట. సలార్ సినిమాను సెప్టెంబరు 28న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఆ తర్వాత ఎన్టీఆర్ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయనున్నాడు. ఆ సమయంలోనే వార్ 2 షూటింగ్ కంప్లీట్ చేయాలని భావిస్తున్నాడట ఎన్టీఆర్. అంతేకాదు వార్ 2 కోసం 90 రోజుల వరకు కాల్ షీట్స్ ఇచ్చాడట.. అక్టోబరులో షూటింగ్ మొదలు పెట్టి.. జనవరిలోపు ఎన్టీఆర్‌కు సబంధించిన షూటింగ్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారట. ఈ లోపు ప్రశాంత్ నీల్ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి.. 2024 ఫిబ్రవరి నుంచి ఎన్టీఆర్ 31ని సెట్స్ పైకి తీసుకెళ్లాని భావిస్తున్నాడట. అయితే ఏప్రిల్ 5న ఎన్టీఆర్ 30 రిలీజ్ ఉంది. కాబట్టి ముందు ఎన్టీఆర్ 30 షూటింగ్ కంప్లీట్ అవాల్సి ఉంది. ఆ తర్వాతే ఎన్టీఆర్ 31పై క్లారిటీ రానుంది. కానీ ఎన్టీఆర్ మాత్రం పక్కాగా ప్లానింగ్‌తో ఈ సినిమాలను సెట్ చేశాడని అంటున్నారు.