యంగ్ హీరో విశ్వక్ సేన్ పై యాక్షన్ కింగ్ అర్జున్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అర్జున్ తన నిర్మాణం, దర్శకత్వంలో విశ్వక్ సేన్‌తో ఓ సినిమా ప్లాన్ చేశాడు. ఈ సినమితో తన కుమార్తె ఐశ్వర్యను తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయం చేయాలనుకున్నాడు.
అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. విశ్వక్ సేన్ తనను మోసం చేశాడని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు అర్జున్. సీనియర్ హిరోలు ఎంతో కమిట్ మెంట్‌తో వుంటారని.. కానీ విశ్వక్ కమిట్ మెంట్ లేని హీరో అని చెప్పాడు. దీనిపై విశ్వక్ కూడా కౌంటర్ ఇచ్చాడు. తాను కమిట్మెంట్ లేని హీరో అని ఇంకెవరైనా అంటే.. ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతానని చెప్పాడు.
మొత్తంగా అర్జున్-విశ్వక్ కాంబో ఆదిలోనే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో మరో యంగ్ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు అర్జున్. లేటెస్ట్ అప్టేట్ ప్రకారం.. శర్వానంద్ కోసం ట్రై చేస్తున్నాడట యాక్షన్ కింగ్. శర్వా అయితే తను అనుకున్న కథకు పర్ఫెక్ట్గా సూట్ అవుతాడని భావిస్తున్నాడట. దాంతో త్వరలోనే శర్వానంద్‌ని కలిసి, కథా చర్చలు జరపబోతున్నట్టు తెలుస్తోంది.
అయితే విశ్వక్ రిజెక్ట్ చేసిన కథను శర్వానంద్ ఓకే చెబుతాడా.. అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. అర్జున్-విశ్వక్ సీన్ మొత్తం చూసిన మిగతా యంగ్ హీరోలు.. ఈ ప్రాజెక్ట్ టేకాప్ చేస్తారా అనేది సందేహం అందరిలోను ఉంది. దాంతో శర్వానంద్ ఎలాంటి డెషిషన్ తీసుకుంటాడనే ఆతృత మొదలైది. మరి అర్జున్‌కు శర్వా ఓకే చెబుతాడేమో చూడాలి.