స్టార్ హీరోల బర్త్ డే సందర్భంగా హిట్ సినిమాలను రీ రిలీజ్ చేసి సంబరాలు చేసుకుంటున్నారు అభిమానులు. ఇప్పటికే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ థియేటర్లను షేక్ చేయగా.. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ రంగం సిద్దం చేస్తున్నారు. రాధే శ్యామ్ ఫ్లాప్ తర్వాత ప్రభాస్ కొత్త సినిమాల నుంచి అప్టేట్స్ పెద్దగా లేవు. సలార్ నుంచి రిలీజ్ డేట్.. ప్రాజెక్ట్ కె షూటింగ్ అప్టేట్ తప్పితే.. ఆదిపురుష్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. దాంతో ప్రభాస్ బర్త్ డే కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఆ రోజు ప్రభాస్ కొత్త సినిమాల నుంచి బిగ్ సర్ప్రైజ్ ఉంటుందనే గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇక డార్లింగ్ బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం భారీగా ప్లాన్ చేస్తున్నారు అభిమానులు. ఇటీవల మహేష్ బర్త్ డే కానుకగా పోకిరి, ఒక్కడు సినిమాలను రీ రిలీజ్ చేయగా.. పవన్ బర్త్ డేకి జల్సా, తమ్ముడు సినిమాల స్పెషల్ షోస్ వేసి రికార్డ్ క్రియేట్ చేశారు.
దాంతో ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అలాగే రచ్చ చేసేందుకు రెడీ అవుతున్నారు. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా.. ముందుగా ‘బిల్లా’ మూవీని రీ రిలీజ్ చేయబోతున్నట్టు వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ప్రభాస్కెరీర్లో ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘వర్షం’ సినిమాను రీ రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎంఎస్ రాజు నిర్మించిన ‘వర్షం’ 2004లో విడుదలైంది. అయితే ఆ తర్వాత ఏడాది.. అంటే 2005లో ‘ఛత్రపతి’ రిలీజ్ అయి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కాబట్టి ప్రభాస్ బర్త్ డే రోజు ఏ సినిమాను రీ రిలీజ్ చేస్తారనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఏది రీలిజ్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం దుమ్ములేపడం ఖాయమంటున్నారు.