Vishwak Sen : పిలవకపోయిన ‘ధమ్కీ’ కోసం ఎన్టీఆర్ వస్తున్నాడు.. విశ్వక్ సేన్!
Vishwak Sen : విశ్వక్ నటించిన 'ధమ్కీ' మూవీ మార్చి 22న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఆయనే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఫస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్ ఇది. ఈ సినిమా విశ్వక్ కెరీర్లో ఎంతో కీలకం. అలాంటి సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో హైప్ రావాలంటే.. ప్రమోషన్స్ గట్టిగా చేయాల్సిందే.
విశ్వక్ నటించిన ‘ధమ్కీ’ మూవీ మార్చి 22న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఆయనే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఫస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్ ఇది. ఈ సినిమా విశ్వక్ కెరీర్లో ఎంతో కీలకం. అలాంటి సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో హైప్ రావాలంటే.. ప్రమోషన్స్ గట్టిగా చేయాల్సిందే. అందుకేనేమో తారక్ అన్న.. నా కోసం రావడం ఇప్పుడు కుదిరిందని చెప్పుకొచ్చాడు విశ్వక్. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ శిల్పకళావేదికలో ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. ఈ ఈవెంట్‌గా గెస్ట్‌గా ఎన్టీఆర్ రాబోతున్నాడు. ఇప్పటికే విశ్వక్ అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేశాడు. అయితే వాస్తవానికి.. అసలు ఈ ఈవెంట్ కోసం ఎన్టీఆర్‌ను సంప్రదించలేదట విశ్వక్ సేన్. కానీ ఎప్పుడో ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ ఈవెంట్‌కు వస్తున్నాడని అన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘అశోక వనములో అర్జున కళ్యాణం’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ గెస్ట్‌గా రావాల్సి ఉంది.. కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. దాంతో జపాన్ ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ నుంచి తిరిగొచ్చిన తర్వాత.. తనని ఇంటికి పిలిపించుకొని మరీ.. ధమ్కీ ఈవెంట్‌కి వస్తానని మాటిచ్చాడని చెప్పుకొచ్చాడు. అయితే తారకరత్న ఇన్సిడెంట్ తర్వాత.. అన్నను ఈవెంట్‌కి రమ్మని పిలవడం కరెక్ట్ కాదని అనిపించింది. కానీ అన్ని సర్దుకున్నాక ఎన్టీఆరే కబురు పెట్టారని.. దాంతో తాము ఈవెంట్ డేట్ ఫిక్స్ చేసినట్లు తెలిపాడు విశ్వక్. నేను అప్రోచ్ కాకపోయినా.. ఇచ్చిన మాటను గుర్తు పెట్టుకొని ఈ ఈవెంట్‌కి వస్తున్నాడని చెప్పాడు. దీంతో ఎన్టీఆర్ ఇచ్చిన మాట తప్పడు అనడానికి ఇదే నిదర్శనం అని చెప్పొచ్చు.