»Suriya Kanguva Is Shooting In Rajahmundry Andhra Pradesh
Kanguva: సూర్య కంగువా షూటింగ్ అప్ డేట్
భారీ బడ్జెట్తో పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న కంగువా చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. హీరో సూర్య దర్శకుడు సిరుత్తై శివ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
Suriya Kanguva is shooting in Rajahmundry, Andhra Pradesh.
Kanguva: హీరో సూర్య(Surya) నటించిన తాజా చిత్రం కంగువా (Kanguva). దర్శకుడు సిరుత్తై శివ(Siruttai Shiva) ఆధ్వర్యంలో భారీ బడ్జెట్తో పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం గ్లింప్స్ ఇప్పటికే విడుదలయ్యాయి. దాంతో ఈ మూవీపై ప్రేక్షకులకు విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. గత నాలుగు నెలలుగా ఏకదాటిగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం..ఇది వరకే కొడైకెనాల్ ప్రాంతంలో ముగించుకుని తాజాగా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజమండ్రిలో కంగువా యూనిట్ ఎంటర్ అయింది. సూర్య, బాబీ డియోల్(Bobby Deol) కాంబినేషన్లో అత్యంత కీలకమైన యాక్షన్ సన్నివేశాలను రాజమండ్రి(Rajahmundry)లో చిత్రీకరిస్తున్నట్లు మేకర్స్ తాజాగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
ఇప్పటికే కంగువా (Kanguva) టీమ్ కేరళ అడవి ప్రాంతంలో చాలా వరకు షూటింగ్ జరుపుకుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ముగిసిన తరువాత చెన్నై, బ్యాంకాక్ ప్రాంతాలలో కూడా షూటింగ్ చేయనున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఆక్టొబర్ నెలలో చిత్రీకరణను పూర్తి చేసుకుని దాదాపు పది భాషాల్లో వచ్చే సంవత్సరం థియేటర్లో విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది. హై బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇది వరకు ఉన్న అన్ని సూర్య రికార్డులను బద్దుల కొడుతుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాలో హీరో సూర్య రెండు మూడు వేరియేషన్స్లో కనిపించబోతున్నారు. ఈయనకు జోడిగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.