టాలీవుడ్(Tollywood) సీనియర్ నటుడు బ్రహ్మాజీ(Bramhaji) కొడుకు సంజయ్ రావు కూడా సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఆయన పిట్ట కథలు అనే సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీ సక్సెస్ అందుకుంది. తాజాగా ఆయన హీరోగా, ప్రణవి(Pranavi) హీరోయిన్గా ‘స్లమ్ డాగ్ హస్బెండ్'(Slum Dog Husband) అనే చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఏఆర్ శ్రీధర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
‘స్లమ్ డాగ్ హస్బెండ్’ ట్రైలర్:
తాజాగా స్లమ్ డాగ్ హస్బెండ్ మూవీ(Slum Dog Husband Movie) ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్(Trailer release) చేసింది. కామెడీ ఎంటర్టైనర్ జోనర్ కథాంశంతో ఈ మూవీ రూపొందింది. ఈ మూవీలో జాతకాలు కలవకపోవడంతో హీరో కుక్కను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత హీరోయిన్‌తో వివాహం అవుతుంది. అయితే కుక్క తర్వాత రెండో పెళ్లి ఏంటని కొందరు వాదిస్తారు. ఆ సమస్యలన్నింటి మధ్య హీరో ఏం చేస్తాడనేదే ఈ మూవీ కథాంశం.
కుక్క(Dog)తో పెళ్లి అనే కొత్త కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కడంతో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి చూసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ మూవీలో నటుడు అలీ, సప్తగిరి, బ్రహ్మాజీ లాంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. మైక్ మూవీస్ బ్యానర్‌పై అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది.