నందమూరి నటసింహం బాలకృష్ణ.. ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. అన్‌స్టాపబుల్ టాక్ షోతో పాటు.. సంక్రాంతికి ‘వీర సింహా రెడ్డి’గా దుమ్ములేపారు. బాక్సాఫీస్ దగ్గరే కాదు.. ఓటిటిలోను దూసుకుపోతున్నాడు వీరసింహారెడ్డి. ఇటీవల డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్కి వచ్చిన వీరసింహారెడ్డికి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత.. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఎన్బీకె 108 ప్రాజెక్ట్ చేస్తున్నారు బాలయ్య. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్, బాలయ్యకు జోడిగా నటిస్తుండగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల కూతురి పాత్రలో నటిస్తోంది. దసరాకు ఈ సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే ఈలోపే మరోసారి థియేటర్లో రచ్చ లేపేందుకు రెడీ అవుతున్నారు బాలయ్య. ప్రస్తుతం టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ ఓ రేంజ్లో నడుస్తోంది. ఇప్పటికే పోకిరి, జల్సా, చెన్నకేశవరెడ్డి, గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాలు రీ రిలీజ్ అయి రికార్డులు క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు సింహా సినిమా రీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. బోయపాటి శ్రీనుతో బాలయ్య చేసిన మొదటి సినిమా ఇదే. దాంతో హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో దుమ్ము లేపింది సింహా. నమిత, స్నేహా ఉల్లాల్, నయన తార హీరోయిన్లుగా నటించారు. 2010లో విడుదలైన ఈ సినిమా.. అప్పట్లో సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. అందుకే మరోసారి థియేటర్లో సింహా గర్జన చేయడానికి రెడీ అవుతోంది. మార్చి 11న సింహా మూవీ రీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి.. మరోసారి సింహా సినిమాను థియేటర్లో చూసేందుకు రెడీ అవుతున్నారు అభిమానులు.