ప్రస్తుతం మెగా పవర్ స్టార్.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో కలిసి ఆర్సీ 15 ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చరణ్ నటప్రస్థానానికి 15 ఏళ్లు పూర్తి కావడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ‘చిరుత’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. 2007 సెప్టెంబర్ 28న భారీ అంచనాల మధ్య ‘చిరుత’ మూవీ రిలీజ్ అయింది. అంచనాలకు తగ్గట్టే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చరణ్‌ను మాసివ్‌గా ఇంట్రడ్యూస్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. తొలి సినిమాతోనే తండ్రి తగ్గ తనయుడిగా.. డాన్సుల్లో, ఫైట్స్‌లో చిరంజీవి నట వారసుడి నిరూపించుకున్నాడు చరణ్.
వైజయంతి మూవీస్ బ్యానర్లో నిర్మాత సి.అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాకు.. మణిశర్మ సంగీతం అందించారు.. దాంతో ఈ చిత్రం మ్యూజికల్‌గా సూపర్ హిట్‌గా నిలిచింది. నేహా శర్మ హీరోయిన్గా నటించింది. మొత్తంగా చరణ్ ‘చిరుత’ వేగానికి 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఇక ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి ‘మగధీర’ సినిమాతో చరణ్ స్టార్ డమ్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాడు. అంతేకాదు మగ ధీరుడిగా టాలీవుడ్ రికార్డులన్నింటినీ తిరగరాశాడు. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ.. రచ్చ, ఎవడు, ధృవ, రంగస్థలం వంటి హిట్ చిత్రాలతో భారీ స్టార్ డమ్ అందుకున్నాడు. ఇక ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్తో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకొని.. మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా దూసుకుపోతున్నాడు చరణ్. ఒక్క హీరోగానే కాదు.. కొణిదెల ప్రొడక్షన్స్ స్థాపించి నిర్మాతగాను రాణిస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్.