పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ పోతున్నాడు. ఆ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో? ఎప్పుడు కంప్లీట్ అవుతాయో? ఎవ్వరికీ తెలియదు. ఇక ఇప్పుడు మరో రెండు సినిమాలు కూడా లైన్లోకి వచ్చేశాయి.
Prabhas: ప్రభాస్ నటిస్తున్న సలార్, కల్కి, మారుతి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఈ సినిమాలన్నీ షూటింగ్ చివరి దశలో ఉన్నాయి. సలార్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా.. కల్కి బ్యాలెన్స్ షూట్ చేస్తున్నారు. మధ్యలో మారుతి సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. ఈ సినిమాల రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ రావడం లేదు. సలార్ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ అవుతుందని ఎప్పుడో అనౌన్స్ చేశారు మేకర్స్. కానీ తీరా విడుదలకు నెల రోజులు మాత్రమే ఉండగా.. బిగ్ షాక్ ఇచ్చారు. సలార్ అనధికారికంగా పోస్ట్‌పోన్ అయిపోయింది. అయినా కూడా ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ గానీ, హోంబలే వారు గానీ క్లారిటీ ఇవ్వడం లేదు.
పైగా సలార్ పార్ట్ 2 కూడా ఉంది కాబట్టి.. ఈ సినిమా ఎప్పుడు థియేటర్లోకి వస్తుందో అంతుచిక్కని విషయమే. ఇక కల్కి సంక్రాంతికి వస్తుందని ప్రకటించినా.. సమ్మర్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక మారుతి సినిమా అయితే అనౌన్స్మెంట్ లేకుండానే షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలు ఇలా ఉండగానే స్పిరిట్ అప్డేట్ కూడా వచ్చేసింది. కెరీర్ ల్యాండ్ మార్క్ అయినటుంటి 25వ సినిమాగా అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో ‘స్పిరిట్’ అనే ప్రాజెక్ట్ ఇప్పటికే అనౌన్స్ చేశాడు ప్రభాస్. ఈ ఇయర్ ఎండింగ్లో స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసి.. ఆ తర్వాత 2024 జూన్‌లో సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈలోపే మంచు విష్ణు ‘భక్త కన్నప్ప’లో శివుడి పాత్రలో నటించేందుకు ప్రభాస్ ఓకె చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఇలా ప్రభాస్ కొత్త సినిమాల అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. రిలీజ్ డేట్, షూటింగ్ మాత్రం అనుకున్న సమయానికి జరగడం లేదు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలు హిట్ కాలేదు. సలార్, కల్కి సినిమాల పై భారీ అంచానలున్నాయి. డిలే చేస్తూ హైప్ తగ్గిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభాస్ ఒక్కో ప్రాజెక్ట్‌ను కంప్లీట్ చేసి.. క్లారిటీ ముందుకెళ్తే బెటర్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.