‘Pawan-Charan’ బ్యాక్ టు బ్యాక్.. ఫ్యాన్స్‌కు పండగే..!
Pawan-Charan : మార్చి నెలలో మెగా ఫెస్ట్ ఓ రేంజ్లో జరగబోతుంది. ఇప్పటికే హాలీవుడ్ మీడియాలో రామ్ చరణ్ హైలెట్ అవుతున్నాడు. నాటు నాటు సాంగ్‌తో మార్చి 12న ఆస్కార్ అందుకొని చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు. ఇదే నెలలో చరణ్ బర్త్ డే కూడా ఉంది. మార్చి 27న చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా చేసేందుకు రెడీ అవుతున్నారు మెగాభిమానులు.
మార్చి నెలలో మెగా ఫెస్ట్ ఓ రేంజ్లో జరగబోతుంది. ఇప్పటికే హాలీవుడ్ మీడియాలో రామ్ చరణ్ హైలెట్ అవుతున్నాడు. నాటు నాటు సాంగ్‌తో మార్చి 12న ఆస్కార్ అందుకొని చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు. ఇదే నెలలో చరణ్ బర్త్ డే కూడా ఉంది. మార్చి 27న చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా చేసేందుకు రెడీ అవుతున్నారు మెగాభిమానులు. చరణ్ కూడా ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ఆర్సీ 15 టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌ను 27న అనౌన్స్ చేయబోతున్నారు. అలాగే చరణ్, బుచ్చిబాబు ప్రాజెక్ట్ నుంచి అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. అయితే అంతకంటే ముందే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్‌తో పాటు.. వినోదయ సీతం రీమేక్‌లో నటిస్తున్నారు. ప్రజెంట్ రీమేక్ షూటింగ్లో పాల్గొంటున్నారు పవన్. సముద్ర ఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోందట. ఉగాది కానుకగా మార్చి 22న, ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను అనౌన్స్ చేయయబోతున్నారట. ఎలాగు షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది కాబట్టి.. అప్డేట్ రావడం ఖాయమంటున్నారు. దీంతో పాటు హరిహర వీరమల్లు అప్డేట్ కూడా రానుందని అంటున్నారు. మొత్తంగా బ్యాక్ టు బ్యాక్.. బాబాయ్, అబ్బాయ్ మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ఖుషీ చేయబోతున్నారు. మెగా ఫ్యాన్స్‌కు పెద్ద పండగ ఇదేనని చెప్పొచ్చు.