గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న తమిళ నటుడు శివకార్తికేయన్(Sivakarthikeyan) శనివారం కేబీఆర్ పార్క్(kbr park)లో మొక్కలు నాటి, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ తండ్రి కాబోతున్నట్లు తెలిపాడు. తన భార్య గర్భవతి అని, ఇప్పుడు తనకు నాలుగో నెల అని వీడియోతో వెల్లడించాడు.
జూలై 9 ఆదివారం ఉదయం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సినీ కార్మికలకు, సినీ జర్నలిస్టులకు ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు.
నాగార్జున హీరోయిన్ టబు మళ్లీ కలిసి నటిస్తున్నారు. డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నాగార్జునకు జోడీగా టబును ఫిక్స్ చేశారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పెళ్లయిన దాదాపు 11ఏళ్లకు వారు తల్లిదండ్రులు అయ్యారు. జూన్ 20వ తారీఖున ఉపాసన హైదరాబాదులోని అపోలో ఆస్పత్రిలో పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
ఓ సినిమా పూర్తవ్వాలి అంటే హీరో, హీరోయిన్, డైరెక్టర్ ఉంటే సరిపోదు. ఇంకా చాలా మంది అవసరం ఉంటుంది. ముఖ్యంగా టెక్నీషియన్స్ అవసరం చాలా ఉంటుంది. ముందు టెక్నీషియన్స్ ని ఒకే చేయాలి. అసలు టెక్నీషియన్స్ అనే వారు ఒకే అయినట్లే. ఇప్పుడు డైరెక్టర్ బుచ్చిబాబు అదే పనిలో ఉన్నాడు.
NVL ఆర్ట్స్ బ్యానర్ పై నండూరి రాము నిర్మాతగా రూపొందిన సినిమా ‘రుద్రమాంబపురం’ . ఈ మూవీ నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. కమెడియన్ గా, విలక్షణ నటుడిగా సత్తా చాటుతున్న అజయ్ ఘోష్ ఈ చిత్రానికి కథ అందించడం విశేషంగా చెప్పుకోవాలి. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న బ్రో చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఊర్వశి రౌతలతో హీరోలిద్దరూ అదిరిపోయే స్టెప్పులేశారు.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ. అయితే, ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయమైన దగ్గర నుంచి వైవిధ్యభరితమైన కథలనే చేస్తూ వస్తున్నాడు. కథలోను .. తన పాత్ర విషయంలోను కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నాడు. అలా ఆయన చేసిన సినిమానే 'బేబి'. వైష్ణవి చైతన్య కథనాయికగా నటించిన ఈ సినిమాలో, విరాజ్ అశ్విన్ కీలకమైన పాత్రను పోషించాడు.
మెగా ఫ్యామిలీలో ఎంత మంది హీరోలు ఉన్నారో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. అంత మంది హీరోలు వచ్చినా, ఎవరికి వారు తమ సినిమాలతో ఆకట్టుకుంటూ స్పెషల్ గా ఫ్యాన్స్ ని సంపాదించుకుంటున్నారు. అయితే, ఇప్పుడు ఈ మెగా హీరోలంతా ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారు. గతంలోనూ ఈ మెగా హీరోలు ఒకేసారి తలపడిన సందర్భాలు ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు యుద్ధానికి దిగడం విశేషం.
వైఎస్ జగన్ పాదయాత్ర కథాంశంతో రూపొందుతోన్న చిత్రం యాత్ర2. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. యాత్ర2 మూవీ 2024 ఫిబ్రవరిలో విడుదల కానుంది.
స్టార్ కపుల్ నయనతార, విఘ్నేశ్ శివన్‌లపై మరో కేసు నమోదైంది. విఘ్నేశ్ శివన్ కుటుంబీకులు ఆ దంపతులపై కేసు పెట్టారు. దీంతో మరోసారి నయన్ విఘ్నేశ్ దంపతులు వార్తల్లో నిలిచారు.
భోజ్‌పురి నటి నేహా మాలిక్ తన హాట్ ఫొటో షూట్ చిత్రాలను అందాల కనువిందు చేస్తుంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ చిత్రాలు చూసిన నెటిజన్లు వావ్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన అత్యంత అంచనాల చిత్రం జైలర్ నుంచి మొదటి సింగిల్ కావలా గురువారం విడుదలైంది. ఇది రిలీజైన కొన్ని గంటల్లోనే ట్రైండింగ్లో కొనసాగడంతోపాటు అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్(Adipurush) చిత్రంలో పలు సన్నివేశాలు, డైలాగ్స్ వివాదాస్పందంగా మారిన విషయం తెలిసిందే. సోషల్ మీడియోలా ఈ అంశంపై పెద్ద ఎత్తున కామెంట్లు వచ్చిన నేపథ్యంలో ఈ మూవీ డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్(manoj muntashir) స్పందించారు. ఈ చిత్రం ద్వారా ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు శనివారం బహిరంగ క్షమాపణలు(apologized) చెప్పారు.