తమిళ హీరో కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో సి.ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన సినిమా ‘సత్యం సుందరం’ మూవీ OTTలోకి రాబోతుంది. ప్రముఖ OTT సంస్థ నెట్ఫ్లిక్స్లో ఈనెల 27 నుంచి స్ట్రీమింగ్ కావాల్సి ఉండగా.. దాన్ని ఈనెల 25కు షిఫ్ట్ చేసినట్లు మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండనుంది. థియేటర్లలో 2:55 గంటలు నిడివితో రిలీజ్ కాగా.. OTTలో 2:38 గంటలకు కట్ చేశారట.