War 2 : విలన్గా ఎన్టీఆర్ ఫిక్స్.. అందుకే భారీ పారితోషికం!
War 2 : యంగ్ టైగర్ ఎన్టీఆర్ విలన్గా చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. జై లవకుశ సినిమాలో నెగెటివ్ రోల్లో దుమ్ము దులిపేశాడు తారక్. ఇక మరో స్టార్ హీరోతో యంగ్ టైగర్ తలపడితే.. బాక్సాఫీస్ బద్దలవుతుంది. అది కూడా హృతిక్ రోషన్ లాంటి హీరోతో.. ఎన్టీఆర్ ఢీ కొడితే బాక్సాఫీస్ లెక్క వేరే లెవల్లో ఉంటుది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ విలన్గా చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. జై లవకుశ సినిమాలో నెగెటివ్ రోల్లో దుమ్ము దులిపేశాడు తారక్. ఇక మరో స్టార్ హీరోతో యంగ్ టైగర్ తలపడితే.. బాక్సాఫీస్ బద్దలవుతుంది. అది కూడా హృతిక్ రోషన్ లాంటి హీరోతో.. ఎన్టీఆర్ ఢీ కొడితే బాక్సాఫీస్ లెక్క వేరే లెవల్లో ఉంటుది. వార్2 మూవీలో ఎన్టీఆర్ నటించబోతున్నాడని తెలిసినప్పటి నుంచి.. సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. వార్ సినిమా చూసిన వారంతా.. వార్ సీక్వెల్లో హీరో హృతిక్ రోషనేనని.. ఎన్టీఆర్ నెగెటివ్ రోల్ చేస్తున్నాడని ఫిక్స్ అయిపోయారు. మరి ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో నెగెటివ్ టచ్ ఇవ్వాలంటే.. అన్ని లెక్కలు మారాల్సిందే. ముఖ్యంగా తారక్ రెమ్యూనరేషన్ మూడంకెలు కాబోతోంది. ట్రిపుల్ ఆర్ సినిమా కోసం 45 కోట్ల పారితోషికం అందుకున్న ఎన్టీఆర్.. వార్ 2 కోసం 100 కోట్లు తీసుకుంటున్నాడని బాలీవుడ్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక పై ఎన్టీఆర్ వంద కోట్ల హీరోగా ఫిక్స్ అయిపోయినట్టేనని అంటున్నారు. అంతేకాదు విలన్గా 100 కోట్లు అందుకొని రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాడు. ప్రస్తుతం తారక్, కొరటాల శివతో ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం 70 నుంచి 80 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోయేది వార్2నే అంటున్నారు. ఆ తర్వాతే ప్రశాంత్ నీల్తో ఎన్టీఆర్ 31 ఉంటుందని సమచారం. వార్2 సినిమాను అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. యష్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్తో నిర్మించబోతుంది. ఈ సినిమాతో యంగ్ టైగర్ క్రేజ్ మరింతగా పెరగనుంది.