యంగ్ హీరో నితిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. అందుకే ఇప్పడు పవర్ స్టార్‌కు మాసివ్ హిట్ ఇచ్చిన డైరెక్టర్‌తో.. నితిన్ ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. భీష్మ సినిమా తర్వాత చేసిన చెక్, రంగ్ దే, మాస్ట్రో సినిమాలు నితిన్‌కు ఆశించిన స్థాయిలో హిట్స్ ఇవ్వలేకపోయాయి. దాంతో ‘మాచర్ల నియోజక వర్గం’ అనే మాస్ సబ్జెక్ట్‌తో ఇటీవలె ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. నితిన్ సొంత బ్యానర్లో తెరకెక్కిన సినిమా కావడంతో.. ఆర్థికంగా కూడా కొంత దెబ్బ కొట్టింది మాచర్ల నియోజకవర్గం. దాంతో అప్ కమింగ్ సినిమాల విషయంలో కాస్త డైలమాలో ఉన్నాడట నితిన్.
ప్రస్తుతం నితన్ చేతిలో ఒకే ఒక్క ప్రాజెక్ట్ ఉంది. వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘జూనియర్’ అనే సినిమా చేయబోతున్నాడు. అలాగే భీష్మ దర్శకుడు వెంకీ కుడుములతోను ఓ సినిమా లైన్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు నితిన్‌తో భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర.. ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. భీమ్లా నాయక్ బ్లాక్ బస్టర్ క్రెడిట్ త్రివిక్రమ్‌కు వెళ్లిపోవడమో.. లేక మరో కారణమో తెలియదు గానీ.. ఇప్పటి వరకు మరో సినిమా అనౌన్స్ చేయలేదు సాగర్. మధ్యలో వరుణ్ తేజ్‌తో సినిమా ఉంటుందని వినిపించినా.. అది పుకార్లకే పరిమతమైంది. అయితే ఇప్పుడు సాగర్‌కు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని టాక్. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రనుందని తెలుస్తోంది. అయితే ఈ ఆఫర్‌ను సాగర్ కరెక్ట్‌గా వాడుకుంటే.. అతనికి తిరుగుండదని చెప్పొచ్చు.