ఇప్పటి వరకు న్యాచురల్ స్టార్ నాని చేసిన సినిమాలు ఒకటైతే.. ఇప్పుడు చేస్తున్న సినిమా మరో ఎత్తులా ఉండబోతోందని చెప్పొచ్చు. క్లాస్, మాస్ సినిమాలతో.. తన న్యాచురల్ నటనతో మెప్పించిన నాని.. ఎన్నడు లేని విధంగా ఈ సారి ఊరమాస్ అవతారం ఎత్తాడు. నాని మాసివ్ లుక్ చూసి.. అసలు ‘నాని’నేనా అనే సందేహాలు రాక మానవు. ప్రస్తుతం నాని ‘దసరా’ అనే ఓ మాస్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం.. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైర్గా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ‘దసరా’ పోస్టర్లు, గ్లింప్స్ ఈ విషయం చెప్పకనే చెబుతున్నాయి.
సింగరేణి బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో.. మహానటి కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ చిత్రం. దాంతో దసరా కానుకగా ఈ చిత్రంలోని ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ అనే ఫస్ట్ సింగిల్‌ను.. అక్టోబర్ ౩న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో నాని ఊరమాస్‌గా కనిపిస్తున్నాడు. ఇంతకు ముందొచ్చిన పోస్టర్ల కంటే.. ఇందులో నాని విశ్వరూపం చూపించాడనే చెప్పాలి. దాంతో ఈ సినిమాలో ఒక కొత్త నానిని చూడబోతున్నామని చెప్పొచ్చు. ఇక వచ్చే సమ్మర్లో రిలీజ్ కానున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌ను.. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మరి ‘దసరా’ మూవీతో నాని ఎలాంటి మాసివ్ ట్రీట్ ఇస్తాడో చూడాలి.