టాలీవుడ్(Tollywood)లో థియేటర్లలోకి దూసుకొస్తున్న తాజాగా చిత్రం మేమ్ ఫేమస్ (Mem Famous Movie). మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ ను నమోదు చేస్తున్నాయి. గతంలో ఇలా వచ్చి విజయం సాధించిన సినిమాలెన్నో ఉన్నాయి. అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘మేమ్ ఫేమస్’. ఈ మూవీకి సుమంత్ ప్రభాస్ దర్శకత్వం(Director Sumanth Prabhash) వహించారు.
‘మేమ్ ఫేమస్’ ట్రైలర్:
తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ (Trailer)ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. హీరో నాని(Hero Nani) ముఖ్య అతిథిగా ఈవెంట్ కు విచ్చేసి ట్రైలర్ ను విడుదల(Trailer Release) చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి బుచ్చిబాబు, శ్రీకాంత్ ఓదెల విచ్చేశారు. గ్రామీణ నేపథ్యంలో ముగ్గురు స్నేహితుల మధ్య నడిచే కథగా మేమ్ ఫేస్ మూవీ(Mem Famous Movie) సాగనున్నట్లు ట్రైలర్ను చూస్తేనే తెలుస్తోంది.
ముగ్గురు ఫ్రెండ్స్ తమ ఊర్లో ఖాళీగా ఉంటారు. ఏ పనీపాటా లేకుండా వారు తల్లిదండ్రుల చేత చివాట్లు తింటుంటారు. ముగ్గురికీ కూడా ప్రేమకథలు ఉంటాయి. వీళ్ల వల్ల పిల్లను ఇచ్చేందుకు అమ్మాయిల బంధువులు ఒప్పుకోరు. ఆ టైంలో ఆ కుర్రాళ్లు ఏం చేశారనేదే ఈ మేమ్ ఫేమస్ సినిమా(Mem Famous Movie) కథాంశం. ఈ నెల 26వ తేదీన ఈ మూవీ విడుదల(Release) కానుంది.