నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా, ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్గా నటించిన.. లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’.. ఈ వారం ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా పై మంచి బజ్ ఉంది. దాంతో ఈ సినిమాతో సుధీర్, కృతి ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు. ముఖ్యంగా కృతిశెట్టికి ఈ సినిమా రిజల్ట్ ఎంతో కీలకంగా కానుంది. ఉప్పెన తర్వాత.. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది కృతి. అయితే ఈ ఏడాది తను నటించిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాయి.
రామ్‌తో చేసిన ‘ది వారియర్’, నితిన్ హీరోగా వచ్చిన ‘మాచర్ల నియోజకవర్గం’ ఫ్లాప్ అవడంతో కృతి కెరీర్ డైలమాలో పడిపోయింది. దాంతో ప్రస్తుతం అమ్మడి ఆశలన్నీ’ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా పైనే ఉన్నాయి. ఇక ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. దాంతో కృతి శెట్టితో పాటు సుధీర్‌కు హిట్ పడినట్టేనని అంటున్నారు. గతంలో సుధీర్ బాబుతో ‘సమ్మోహనం’, ‘వి’ సినిమాలు తీసిన ఇంద్రగంటి.. ఈ సారి అందమైన లవ్ స్టోరీని తెరకెక్కించినట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా పూర్తి రిజల్ట్ ఏంటనేది తెలియాలంటే.. ఈ వీకెండ్ వరకు వెయిట్ చేయాల్సి ఉంది. ఇక ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో ఇంట్రాక్ట్ అయింది కృతి. ఈ సందర్భంగా మహేష్ బాబు గురించి.. ‘రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ ఆయన సూపర్ స్టార్’ అంటూ చెప్పుకొచ్చింది. దాంతో కృతికి మరింత ఫిదా అయిపోతున్నారు మహేష్ ఫ్యాన్స్. మరి ఈ సినిమాతో కృతి బ్యాక్ బౌన్స్ అవుతుందేమో చూడాలి.