ఎన్టీఆర్ 30 అప్డేట్ విషయంలో.. అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పందించాడు ఎన్టీఆర్. ప్రతీ పూటకు, గంటకు అప్టేడ్ అంటే కష్టం.. సమయం వచ్చినప్పుడు మేమే చెబుతాం.. కాస్త ఓపిక పట్టండని చెప్పాడు తారక్. అలాగే మార్చిలో సెట్స్ పైకి వెళ్తామని.. 2024 ఏప్రిల్ 5న ఎన్టీఆర్ 30 రావడం పక్కా అని మరోసారి క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా కోసం భారీ సెట్టింగ్ వేసే పనిలో బిజీగా ఉన్నాడు కొరటాల. ఈ సినిమా కథ సముద్రం బ్యాక్ డ్రాప్లో ఉంటుందని చాలా రోజులుగా వినిపిస్తోంది. అందుకే హైదరాబాద్, వైజాగ్, గోవాలో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి వీఎఫ్ఎక్స్ కూడా భారీగా ఉంటుందని అంటున్నారు. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. హీరోయిన్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. జాన్వీ కపూర్ ఫిక్స్ అయిపోయిందని అంటున్నా.. అఫిషీయల్ అనౌన్స్మెంట్ ఇవ్వడం లేదు. ఒక్క హీరోయిన్ విషయంలోనే కాదు విలన్ ఎవరనేది.. మరింత సస్పెన్స్‌గా మారింది. అయితే తాజాగా.. కొరటాల శివ ఈ సినిమాలో మరో స్టార్ హీరో కోసం ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. సినిమాలో ఓ కీలకపాత్ర ఉందట.. అది చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందని సమాచారం. అందుకోసం తమిళ్, బాలీవుడ్ స్టార్ హీరోల పేర్లను పరిశీలిస్తున్నారట. ఈ క్రమంలో.. కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్, బాలీవుడ్ హీరో సైఫ్ అలిఖాన్తో పాటు.. ఇంకా మరి కొన్ని పేర్లు పరిశీలనలో ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. అయితే వీళ్లను విలన్ కోసం ట్రై చేస్తున్నారా.. లేదంటే జనతా గ్యారెజ్ సినిమాలో మోహన్ లాల్ లాంటి రోల్ కోసమా.. అనేది సస్పెన్స్‌గా మారింది. ఒకవేళ మరో స్టార్ హీరో ఎన్టీఆర్ 30లో ఫిక్స్ అయితే మాత్రం.. అంచనాలు పీక్స్‌కి వెళ్లడం పక్కా. మరి ఎన్టీఆర్ 30 ఎలా ఉంటుందో చూడాలి.