Killer Soup: ఓపెన్ చేస్తే మైంజూర్ సిటీలో శెట్టి విల్లా ఉంటుంది. ఆ ఇంట్లో స్వాతి, ప్రభాకర్ భార్యభర్తలు. వాళ్ల ఫోటోలు ఉంటాయి. స్వాతి మటన్ సూప్ చేస్తుంది. ప్రభాకర్ లేచి, స్నానం చేసి డ్రెసప్ అవుతాడు. స్వాతి సూప్ చేసి డైనింగ్ టేబుల్ పై పెడుతుంది. మళ్లీ సూప్ చేశావా అని దాన్ని టేస్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. తరువాత వాళ్ల అన్న అరవింద్ గురించి మాట్లాడుతాడు. అతన్ని నువ్వే కదా మోసం చేసింది అని స్వాతి అంటే నువ్వు ఆఫ్ట్రాల్ ఒక నర్సువి, బిజినెస్ గురించి తొక్కలో ఐడీయాలు ఇయ్యకు అని అంటాడు. సర్లే ముందు సూప్ తాగు అని అంటుంది. సూప్ నోటి దగ్గరకు తీసుకొని వామ్టింగ్ సెన్సెషన్ ఫీల్ అవుతాడు. తరువాత కిచెన్ లోకి వెళ్లి తాగుతానని సింక్ దగ్గరకు వెళ్తాడు. ఆ సమయంలో ప్రభాకర్ పర్సులోంచి మనీ తీసుకుంటుంది స్వాతి. ప్రభాకర్ సూప్ పడేస్తాడు. తాను సింక్ లో పోసిన విషయం తెలిసి స్వాతి ప్లేట్ పగలగొడుతుంది. కిల్లర్ సూప్ టైటిల్ పడుతుంది.
చదవండి:Chiranjeevi: ఈ కథ చిరంజీవి రిజెక్ట్ చేసింది కాదట?
తరువాత సీన్లో అరవింద్, ప్రభాకర్ మస్సాజ్ చేసుకుంటారు. వాల్లకు మస్సాజ్ చేసే ఉమేష్ తో సరదాగా మాట్లాడుతారు. అదే సమయంలో ఒక పేపర్ ను ప్రభాకర్ బ్యాగ్ లో పెడుతాడు ఉమేష్. తరువాత ఉమేష్ అచ్చం నీలానే ఉన్నాడు, కానీ మెల్ల కన్ను అని అరవింద్ అంటాడు. అయినా వీడికి తెలుగు రాదు కదా అని నవ్వుతారు. నెక్ట్స్ సీన్లో అరవింద్ కూతురు అప్పుతో స్వాతి మాట్లాడుతుంది. తాను ఫ్రాన్స్ వెళ్తున్నట్లు చెప్తుంది. అదే సమయంలో అరవింద్ కు సూప్ తాగమని స్వాతి అంటుంది. అతను పట్టించుకోకుండా వెళ్తాడు. ప్రభాకర్ ను తాగమని అడిగితే తనకు అసిడిటీ అని చెప్తాడు. అదే సమయంలో స్వాతికి నువ్వు బ్యూటిఫుల్ అని మెస్సెజ్ వస్తుంది. అంతలో అక్కడికి నాడర్ వస్తాడు. సూప్ తీసుకొని తాగి బయటకు ఊచేస్తాడు.
నెక్ట్స్ సీన్లో నాడర్ ఫోటోలు తీస్తుంటాడు. తరువాత స్వాతికి చెప్పి ప్రభాకర్, అరవింద్ కూడా కార్లో వెళ్లిపోతారు. తరువాత సీన్లో బురుక వేసుకున్న ఒక లేడీ నడుచుకుంటూ ఉమేష్ రూమ్ దగ్గరకు వెళ్తుంది. బురక ఓపెన్ చేస్తే స్వాతి. స్వాతిని ముద్దు పెట్టుకుంటాడు. ఇద్దురు బెడ్ పై పడిపోగానే గోడకు ఉమేష్, స్వాతి పెళ్లి చేసుకున్న ఫోటోలు ఉంటాయి. తరువాత ఉమేష్ స్వాతికి మస్సాజ్ చేస్తుంటాడు. ప్రభాకర్ నేను ఒకేలా కనిపిస్తామనే కదా నా దగ్గరకు వస్తున్నావు అంటే తాను నవ్వుతుంది. నన్ను లవ్ చేయట్లేదా అని ఉమేష్ అడుగుతాడు. తాను ఏం చెప్పకుండా లేట్ అయిందని రెడీ అవుతుంది. రెంట్ కట్టాలని డబ్బులు అడిగి తీసుకుంటాడు.
తరువాత సీన్లో పార్టీ చేసుకుందామని ఈ పాడు బడ్డ బిల్డింగ్ కు తీసుకొచ్చావు అని అరవింద్ అంటాడు. ముందు లోపలికి వెళ్లు అంటాడు ప్రభాకర్. తరువాత పేపర్ బ్లాస్ట్ పేలుతుంది. అమ్మాలతో అరవింద్ డ్యాన్స్ చేస్తుంటాడు. మరో సీన్లో స్వాతి తనకు వంట నేర్పించే మాస్టర్ దగ్గరకు వస్తుంది. తాను చేసిన సూప్ వాప్టింగ్ వచ్చేలా ఉందని తాను చెప్తుంది. సూప్ మంచిగా రావాలంటే రెగ్యూలర్ గా రావాలి అని చెప్తుంది. తరువాత సీన్లో ప్రభాకర్ బ్యాగ్ లో ఉమేష్ పెట్టిన చీటి చదువుతాడు. 50 లక్షలు ఇవ్వకపోతే మీ అన్నకు చెప్తా అని రాసి ఉంటుంది. అదే సమయంలో నాడర్ కార్లో ఉండీ తన ఫోటోలు తీస్తుంటాడు. స్వాతి గమనించి దగ్గరకు వెళ్తుంటే కారు స్టార్ట్ అవదు . కెమెరా పట్టుకొని లాగుతుంది. అదే సమయంలో ప్రభాకర్ తనకు ఫోన్ చేస్తుంటాడు. కారు స్టార్ట్ అవుతుంది. కెమెరా స్వాతి చేతులో ఉంటుంది. దాని కోసం నాడర్ చూస్తుంటే ఒక లారీ వచ్చి కారుకు డ్యాష్ ఇస్తుంది. అక్కడి నుంచి స్వాతి వెళ్లిపోతుంది.
నెక్ట్స్ ప్రభాకర్ పార్టీ చేసుకుంటూ తన పెట్టబోయే రిసార్ట్ గురించి చెప్తుంటాడు. తరువాత సీన్లో ఉమేష్ పేకట క్లబ్ కు వెళ్తాడు. బ్యాలెన్స్ ఇచ్చి లోపలికి రమ్మంటారు నిర్వాహకులు. దాంతో ఉమేష్ తప్పించుకొని లోపలికి వెళ్తాడు. అక్కడ కొంత మంది ఉమేష్ కొట్టి బయటకు పంపిస్తారు. బ్యాలెన్స్ అమౌంట్ తీసుకొనిరా అని చెప్తారు. అదే సమయంలో మనిష కోయిరాల అంటే స్వాతి ఇంటికి రమ్మని చెప్తుంది. నెక్ట్స్ అరవింద్ తో తన రిసార్ట్ గురించి చెప్తాడు. ఇదంతా సెట్ అవదు, నీకు బిజెనెస్ సెట్ అవదు అని అరవింద్ కొప్పడి వెళ్లిపోతాడు. ప్రభాకర్ హట్ అవుతాడు. రెస్టారెంట్ మినేచర్ ను ధ్వంసం చేస్తాడు.
స్వాతి ఇంటికి వచ్చిన ఉమేష్ కెమెరాలో వాళ్ల ఫోటోలు చూస్తాడు. మన విషయం ప్రభాకర్ కు తెలిసిపోతుంది అని స్వాతి ఏడుస్తుంది. మనం పాండిచ్చేరి వెళ్లిపోదామని, బంగారం, డబ్బులు తీసుకో అని చెప్తాడు. అదే సమయంలో డోర్ బెల్ సౌండ్ వినిపిస్తుంది. ఎవరా అని చూస్తే ప్రభాకర్ వస్తాడు. తరువాత ఉమేష్ ను దాచిపెట్టడానికి ట్రై చేస్తుంది. ఆ తొందరలో కెమెరా తీసుకుపోవడం మరిచిపోతాడు. తరువాత స్వాతి డోర్ ఓపెన్ చేస్తుంది. ఇంట్లోకి వస్తూ ఏదో డౌట్ వచ్చి కిచెన్ లోకి వెళ్తాడు. అక్కడ వాటర్ తాగి మాట్లాడుతుండగా, ఉమేష్ బెడ్ రూమ్ లోకి వెళ్లీ కెమెరా తీసుకుంటాడు. ప్రభాకర్ బెడ్ రూమ్ లోకి వెళ్తాడు. బెడ్ చిందరవందరగా ఉండడం చూసి ఏం జరుగుతుంది అని అడుగుతాడు. తానే సెల్ఫ్ సాటీస్ ఫై అవుతున్నా అని చెప్తుంది. దాంతో ప్రభాకర్ స్వాతిని కిస్ చేస్తాడు. బెడ్ కింద ఉమేష్ ఉంటాడు. ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. నెక్ట్స్ రిసార్ట్ బిజినెస్ గురించి అడిగితే అన్నయ్య ఒప్పుకున్నాడు అని చెప్తాడు. నాడర్ ఎవరు అని స్వాతి అడుగుతుంది. అతనొక్క ప్రయివేట్ డిటెక్టీవ్ అని ఒక చిన్న పనికోసం పెట్టుకున్నా అంటాడు. తనకోసమే అని స్వాతి అనుకుంటుంది. తన డ్రీమ్ గురించి స్వాతి చెప్తుంటే ప్రభాకర్ నిద్ర పోతాడు.
అదే సమయంలో ఉమేష్ ను పిలుస్తుంది. అతడు బెడ్ కింద నిద్ర పోతాడు. అతన్ని లేపి, బయటకు తీసుకొచ్చి… నువ్వు వెళ్లు అని చెప్తుంటే.. మీ మధ్య ఏం జరుగుతలేదన్నావ్.. ఇప్పుడేంటి ఫుల్ రొమాన్స్ అని ఉమేష్ అంటాడు. అదే సమయంలో ప్రభాకర్ కు అసిడిటీ వచ్చి టాబ్లెట్ తీసుకుంటాడు అది జారి మంచం కింద పడుతుంది. అక్కడే తనకు కెమెరా దొరుకుంది. నెక్ట్స్ ఉమేష్, స్వాతి మాట్లాడుకుంటే అక్కడికి ప్రభాకర్ వస్తాడు. కోపంతో ఉమేష్ ను కొడుతాడు. స్వాతిని గొంతుపట్టుకుంటాడు. ఉమేష్ ప్లవర్ వాజ్ తో తలపై బలంగా కొడుతాడు. స్వాతిని తిట్టుకుంటూ ప్రభాకర్ కింద పడిచనిపోతాడు. స్వాతి దగ్గరకు వెళ్లి చూస్తే చనిపోతాడు. అదే సమయంలో తనకు నాడర్ ఫోన్ చేస్తాడు. అది చూసి స్వాతి, ఉమేష్ షాక్ అవుతారు.
నెక్ట్స్ సీన్లో నాడర్ కారు ప్రమాదంలో చనిపోతాడు. క్రైమ సీన్ ను స్టడీ చేయడానికి పోలీసులు వస్తారు. హాస్సన్ బాడీని చూస్తుండగా, తుపాలి తాను చేసిన దర్యాప్తును ఎక్స్ ప్లెయిన్ చేస్తాడు. అదే సమయంలో కెమెరా మిస్సింగ్ అని చెప్తుండగా.. అక్కడ ఉన్న ఓ పిచ్చావిడ నేను చూశాను ఆ అమ్మాయి బురక వేసుకొని ఉంది అని అరుస్తుంది. తుపాలి ఆమె దగ్గరకు వెళ్లి వివరాలు అడుగుతాడు. తరువాత హాస్సన్ దగ్గరకు వెళ్లి తనకు యాక్సిడెంట్ జరిగిన టైమ్ లో ఒక నెంబర్ మల్టీ టైమ్స్ కాల్ వచ్చిందని చెప్తాడు. దర్యాప్తు మెల్లిగా చేద్దామని రేపు నాడర్ వాళ్ల అమ్మతో మాట్లాడాలి అని హాస్సన్ వెళ్తాడు. తుపాలి నాడర్ ఫోన్ నుంచి ప్రభాకర్ కు కాల్ చేస్తాడు. స్వాతి లిఫ్ట్ చేస్తుంది. ప్రభాకర్ పడుకున్నారు అని చెప్తుంది. రేపు మార్నింగ్ పోలీస్ స్టేషన్ కు రమ్మంటారా అని తుపాలి అడిగితే.. సరే అని చెప్తుంది. కావాలిన మీ ఆయనను చంపలేదు మనం సరెండర్ అవుదాము అని ఉమేష్ చెప్తాడు. స్వాతి వద్దు అని చెప్తుంది.
ప్రభాకర్ బాడీని చాపలో మూట కడుతారు. మార్నింగ్ తుపాలి ఎక్సర్ సైజ్ చేసి తన బైక్ పై వెళ్తాడు. ప్రభాకర్ బాడీని ఒక ఫారెస్ట్ కు తీసుకెళ్లి గోతి తీసి అందులో వేస్తారు. ఉమేష్ జారి గోతిలో పడిపోతాడు. ప్రభాకర్ చావలేదు అని చెప్తాడు. అదంత నీ భ్రమ అని చెప్తుంది. తరువాత సీన్లో నాడర్ మదర్ దగ్గరకు వెళ్లి తన కొడుకు గురించి అడుగుతారు. నాడర్ కు డ్రగ్స్ అలవాటు ఉందా అని అడిగితే హాస్సన్ కొప్పడి బయటకు వెళ్లిపో అంటాడు. తుపాలి గదిబయటకు వచ్చేస్తాడు. నాడర్ కంప్యూటర్ ఓపెన్ చేసి షాక్ అవుతాడు. తరువాత హాస్సన్ తో తన కంప్యూటర్ లో ఒక క్లూ దొరికింది అని చూపిస్తాడు.
సీసీ కెమెరాలో ప్రభాకర్, నాడర్ మాట్లాడుకుంటారు. ఒకడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని అతను ఎవరో కనిపెట్టమని చెప్తాడు. తరువాత స్వాతి, ఉమేష్ కారు తీసుకొని వస్తుంటారు. స్వాతి ప్రభాకర్ కనిపించినట్లు ఊహించుకొని సడెన్ బ్రేక్ వేస్తుంది. అంతలో కాల్ వస్తుంది. పోలీసుస్టేషన్ కు వస్తారా అంటే రేపు వస్తారు అని చెప్తుంది. తరువాత తుపాలి పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు. అక్కడికి హస్సన్ వచ్చి బజ్జీలు తింటాడు. తుపాలి లారీ డ్రైవర్ ను ఇంటరాగేట్ చేస్తుంటాడు. తనకు ఏం తెలియదు అని చెప్తాడు. అక్కడికి హాస్సన్ వచ్చి అడిగితే లేదు అని చెప్తాడు. హాస్సన్ కొడుతాడు. అప్పుడు నిజం చెప్తాడు. తాను వస్తుంటే కారు మధ్యదలో అడ్డంగా ఆగింది అని, కంట్రోల్ తప్పడంతో ఢీ కొట్టాను అని చెప్తాడు. అక్కడే ఒక బురక వేసుకున్న అమ్మాయి ఉందని చెప్తాడు.
ఓ ఫార్మసి షాప్ కు వెళ్లి ఫ్లోర్ క్లీనర్ చేసే యాసిడ్ బాటిల్ తీసుకొని వస్తుంది. ప్రభాకర్ చనిపోయిన విషయం పోలీసులు కనిపెట్టేస్తారు అని ఉమేష్ అంటాడు. ప్రభాకర్ అసలు చనిపోతేనే కదా అని అంటుంది. తరువాత పేస్ రి కన్ స్ట్రక్షన్ చెద్దాము అంటుంది. ఉమేష్ వద్దని వారిస్తాడు. ఇల్లంత క్లీన్ చేస్తారు. ఆ యాసిడ్ ను ఇంటి గార్డెన్ ఒక మొక్కపై పోస్తుంది. ఉమేష్ ను కన్విన్స్ చేస్తుంది. ఇద్దరము పెళ్లి చేసుకుందాము అని అతన్ని కిస్ చేస్తుంది. హెయిర్ కట్ చేస్తుంది. తరువాత సీన్లో తుపాలి వంట నేర్పించే ఆవిడ దగ్గరకు వెళ్లి బురక వేసుకున్న ఆవిడ గురించి అడిగితే తనకు ఏమి తెలియదు అని చెప్పి వెళ్తుంది. తరువాత ఒక లేడి వచ్చి తన దగ్గర డబ్బులు తీసుకొని తన పేరు మనిషా కొయిరాల అని చెప్తుంది.
నెక్ట్స్ సీన్లో స్వాతి యాసిడ్ ను తన షోల్డర్ పై వేసుకుంటుంది. తరువాత ఉమేష్ కు ఇంజక్షన్ ఇచ్చి కాటన్ తనకు మెల్ల కన్ను ఉంటుంది. దాని చుట్టు పెడుతుంది. అంతలో ఫోన్ వస్తే వెళ్తుంది. ఉమేష్ బాటిల్ తీసువకుంటాడు. తుపాలి ఫోన్ చేసి మనిషా కోయిరాలా అనిగానే తన షాక్ అయి సిమ్ తీసేస్తుంది. అదే సమయంలో ఉమేష్ యాసిడ్ మీద పోసుకుంటాడు. అరుస్తాడు. స్వాతి వచ్చి తనకు ట్రీట్ చేస్తుంది. మరో సీన్లో తుపాలి హస్సన్ కు కాల్ చేసి మనిషా కోయిరాల ఫేక్ అని చెప్తాడు. ఉమేష్ ను ఆసుపత్రికి తీసుకెళ్తారు. అతని ఫేస్ పై యాసిడ్ పడడంతో కన్ను పోయిందని, యాసిడ్స్ పీల్చడం వలన గొంతు కూడా పోయింటుందని డాక్టర్ చెప్తాడు. అక్కడే అరవింద్ ఉంటాడు. త్వరగా ట్రీట్మెంట్ చేయమని చెప్తాడు.
ఆసుపత్రికి తుపాలి, హాస్సన్ వస్తారు. స్వాతితో మాట్లాడుతారు. గేటు పక్కనే ఎటాక్ జరిగింది అని చెప్తుంది. ఒక అతను వచ్చి డబ్బులు ఇవ్వమని చెప్పింది. ఇచ్చాము కానీ ఈ లాకెట్ అడిగాడు ఇది చాలా సెంటిమెంట్ ప్రభాకర్ ఇవ్వలేదు, అతన ఎటాక్ చేశాడు. తన మీద కూడా యాసిడ్ పడిందని చూపిస్తుంది. స్వాతికి నాడర్ ఇంట్లో దొరికిన లెటర్ చూపిస్తాడు. అదే సమయంలో తుపాలికి జింకానా క్లబ్ లో ఉమేష్ అనే వ్యక్తి ప్రభాకర్ కు మాస్సాజ్ చేస్తాడు అని ఫోన్ వస్తుంది. తుపాలి అక్కడి బయలు దేరుతాడు. మరో సీన్లో అరవింద్ తన బామ్మర్ది చార్లెస్, కూతురు అప్పుతో మాట్లాడుతుంటే.. అప్పుడు ఫ్రాన్స్ లో అడ్మిషన్ వచ్చిందని సంతోషపడుతుంది. అరవింద్ పంపించను అంటాడు. అతన్ని తిట్టేసి నేను వెళ్తున్నా ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి వెళ్లిపోతుంది.
నెక్ట్స్ సీన్లో ప్రభాకర్ ను ఎందుకు బ్లాక్ మెయిల్ చేశావు అని ఉమేష్ ను తిడుతుంది. మన కోసమే చేశాను అని, ఐలవ్ యూ అని చెప్తుంది. స్వాతి కూడా ఐ లవ్ యూ చెప్తూ తన లాకెట్ వైపు చూస్తుంది. నెక్ట్స్ తుపాలి ఉమేష్ మస్సాజ్ రూమ్ కు వెళ్లి అన్ని చెక్ చేస్తాడు. అక్కడ డస్ట్ బిన్ లో ఉన్న కాగితాలను చెక్ చేస్తే ఉమేష్ రైటింగ్, బ్లాక్ మెయిలర్ రైటింగ్ సేమ్ అని సంతోష పడుతాడు. అదే విషయాన్ని హాస్సన్ కు ఫోన్ చేసి చెప్తాడు. అదే సమయంలో స్వాతి బయటకు వెళ్తుంటే ఉమేష్ పిల్లై గురించి తెలుసా అంటే తెలియదు అని చెప్తుంది. అతనే మీ వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అని చెప్తాడు. అక్కడి నుంచి స్వాతి వెళ్లిపోతుంది. తరువాత తుపాలి, స్వాతి ఇంటి దగ్గర చెక్ చేస్తాడు. అదే సమయంలో హాస్సన్ ఫోన్ చేసి ఉమేష్ ఇంటికి వెళ్లి చెక్ చేయమంటాడు. కట్ చేస్తే స్వాతి ఉమేష్ ఇంటికి వెళ్లి అక్కడ పోస్టర్స్ చూస్తుంది. వాటిని అతని థింగ్స్ ను తీసుకొని కార్లో పారిపోతుంది. అది చూసిన తుపాలి ఫాలో అవుతాడు. ప్రభాకర్ ను పాతిపెట్టిన ఫారెస్ట్ కు వెళ్తుంది. మట్టి తీసి లాకెట్ తీసుకుంటుంది. అదే సమయంలో అక్కడికి తుపాలి వస్తాడు. తనను చూసి పారిపోతుంది. తనను వెతుకుతూ తుపాలి వెళ్తాడు. ఫోన్ చేద్దామంటే సిగ్నల్ ఉండడు. సిగ్నల్ కోసం వెతుకుతూ సూసైడ్ స్పాట్ కు వెళ్లి స్వాతినే అంతా చేసింది అని చెప్తాడు. అదే సమయంలో స్వాతి వస్తుంది. హాస్సన్ తనకేమి వినపడలేదు అని చెప్తుండగా.. స్వాతికి గన్ పెట్టి జారి లోయలో పడిపోతాడు. తరువాత ఉమేష్ థింగ్ అందులో వేసి కాల్చేస్తుంది. నెక్ట్స్ సీన్లో స్వాతి రెడీ అయి ఆసుపత్రికి వెళ్తుంది. అక్కడ పోలీసులను చూసి కంగారు పడుతుంది. అలానే నడుచుకుంటూ ఉమేష్ దగ్గరకు వెళ్తుంది అక్కడ అరవింద్, అప్పుడు డాక్టర్ తో మాట్లాడుతుంటారు. అప్పు వచ్చి స్వాతిని హగ్ చేసుకుంటుంది. తుపాలి నీటిలో పూర్తిగా మునిగిపోతాడు.
రెండు రోజుల తరువాత పిల్లలు చెరువులో స్విమ్ చేస్తుంటారు. అదే సమయంలో తుపాలి బాడీ కొట్టుకొస్తుంది. తరువాత బాలెన్స్ షీట్ చెక్ చేస్తుంది అప్పు. టాక్స్ కట్టట్లేదని వాళ్లా అంకుల్ తో చెప్తుంది. అది నీ జాబ్ కాదు అని చెప్పి వెళ్తాడు. మరో సీన్లో కీర్తిమ ఉమేష్ దగ్గరకు వచ్చి ప్రభాకర్ అనుకొని అతన్ని ముద్దు పెడుతుంది. ఉమేష్ షాక్ అయి చూస్తాడు. అంటే ప్రభాకర్ కు కీర్తిమకు ఎఫైర్ ఉంటుంది. అదే సమయంలో అక్కడికి స్వాతి వస్తుంది. కీర్తిమ షాక్ అయి బొకే ఇచ్చి వెళ్తుంది. తనతో స్వాతి మాట్లాడుతుండగా హాస్సన్ వచ్చి మాట్లాడొచ్చా అని చెప్తాడు. తనతో మాట్లాడుతుండగా లేడీ కానిస్టేబుల్ వచ్చి తుపాలి చనిపోయిన విషయం చెప్తాడు. అతను సిరియస్ గా వెళ్తాడు. అక్కడికి అరవింద్ వచ్చి ఉమేష్ నిన్ను ఎందుకు బ్లాక్ మెయిల్ చేశాడు అని బెదిరిస్తాడు. తనకు డబ్బుల గురించి చెప్పగానే వెళ్లిపోతాడు. తరువాత స్వాతి ఎందుకు చెప్పావు అని అంటుంది. మనకోసమే అని ఉమేష్ చెప్తాడు. ఇద్దరు పాట పాడుకుంటూ హగ్ చేసుకొని పడుకుంటారు.
నెక్ట్స్ సీన్లో హాస్సన్, తుపాలి బాడీని చూసి ఎమోషనల్ అవుతాడు. నెక్ట్స్ సీన్లో ఉమేష్ గాయానికి ఉన్న కట్టు తీస్తారు. తనను డిస్చార్జ్ చేసి తీసుకొస్తుంటే చార్లెస్ లుకాస్ వచ్చి తీసుకెళ్తాడు. తరువాత హాస్సన్ తుపాలి మర్డర్ గురించి ఎక్స్ ప్లైన్ చేస్తాడు. తరువాత ఉమేష్ గురించి చెప్తాడు. మన టార్గెట్ ఉమేష్ అని చెప్తాడు. దాంతో ఆఫీసర్ వెళ్లిపోతాడు. నెక్ట్స్ సీన్లో ప్రభాకర్ వస్తున్నాడు అని అరవింద్ బ్యాండ్ ఏర్పాటు చేస్తాడు. అప్పు, స్యాండిని చూపించి సర్ ప్రైజ్ అంటుంది. నెక్ట్స్ సీన్లో హాస్సన్ తుపాలి థింగ్స్ ను ప్యాక్ చేస్తుంటే, అక్కడ ఒక నోట్ దొరుకుతుంది. తరువాత ఉమేష్, అరవింద్ డైనింగ్ చేస్తుంటారు. ఉమేష్ మాత్రం సూప్ తాగుతాడు. అరవింద్ తాగడానికి రమ్మంటే స్వాతి వద్దంటుంది. మందు తాగుతుంటే ఆ కట్టు తీయ్ అంటాడు. అది తీయగానే అరవింద్ అవేశంతో ఉమేష్ ను చంపేస్తా అంటాడు. అతన్ని మరిచి అన్నయ్య అంటే అతని డిటైల్స్ అన్ని చార్లెస్ చెప్తాడు. దాంతో ఉమేష్ షాక్ అవుతాడు.
తరువాత సీన్లో అప్పు, స్వాతి ప్రభాకర్ బిజినెస్ ల గురించి మాట్లాడుకుంటారు. తరువాత ఉమేష్ నా బిజినెస్ గురించి ఎలా తెలిసింది అని అరవింద్ అడుగుతాడు. జింకాన క్లబ్ లో మస్సాజ్ టైమ్ లో విని ఉంటాడు అని చెప్తాడు. తాను పెద్ద తప్పు చేశాను అని ఏడుస్తాడు. అరవింద్ ఓదారుస్తాడు. తరువాత హాస్సన్ పేకట క్లబ్ కు వెళ్లి తుపాసు గురించి అడిగితే తెలియదు అంటారు. ఉమేష్ గురించి అడిగితే తెలుసు అంటారు. క్లబ్ అయిపోగానే హాస్సన్ బయటకు వచ్చి టాయిలేట్ చేస్తుంటే అక్కడ తుపాస్ బైక్ కనిపిస్తుంది. దాంతో మళ్లి వెనక్కి వెళ్లి వాళ్లను బెదిరించి తానే కిందపడుతాడు.
నెక్ట్స్ సీన్లో స్యాండీతో స్వాతి మాట్లాడుతుంది. డాడి ఎందుకో నార్మల్ గా కనిపించట్లేదు అని అంటాడు. అదేం లేదు అని సర్దిచెప్తుంది. తరువాత ఉమేష్, స్వాతి మాట్లాడుకుంటారు. రిసార్ట్ కోసం అడిగితే అరవింద్ నవ్వేసి వెళ్తాడు. అంటే ప్రభాకర్ చెప్పినవి అన్ని అబద్దాలే అని అంటాడు. స్వాతి లేచి వెళ్లిపోతుంది. అంతలో బ్లాక్ మెయిల్ నుంచి మరో మెయిల్ వస్తుంది. తరువాత సీన్లో హస్సన్ నెలపై పడి ఉంటాడు. తుపాలి కనిపిస్తాడు. హాస్సన్ షాక్ అవుతాడు.
బ్లాక్ మెయిలర్ మెయిల్ ఓపెన్ చేస్తే 31 కోట్లు నొక్కెశారు అని తెలుస్తుంది. దాంత ఉమేష్ షాక్ అవుతాడు. అరవింద్ కు దీని గురించి తెలిస్తే నీతో కూర్చొని ఎందుకు మందుకొడుతాడు అని స్వాతి అంటుంది. ఆ ప్రస్టేషన్ లో ఉమేష్ అరుస్తుంటే స్యాండీ వస్తాడు. అతనిపై అరుస్తాడు ఉమేష్. స్వాతి తనను పడుకొబెడుతుంది. తరువాత సీన్లో హాస్సన్ పడుకొని లేచి బ్రెష్ చేసుకుంటుంటాడు. మళ్లీ తుపాలి కనిపిస్తాడు. నెక్ట్స్ సీన్లో చార్లెస్ అప్పు మాట్లాడుకుంటారు. అరవింద్ వస్తాడు. అప్పుకు సూర్యను పరిచయం చేస్తాడు. తరువాత ఉమేష్ గురించి చార్లెస్ ను అడుగుతాడు.
నెక్ట్స్… హాస్సన్ పోలీసు స్టేషన్ కు వెళ్లి తుపాలిని తీసుకొచ్చాను అని చూపిస్తే పోలీసులకు అర్థం కాదు. అదే సమయయంలో ఆఫీసర్ వచ్చి మీ కోసం ప్రభాకర్, స్వాతి వచ్చారు అని చెప్తాడు. కట్ చేస్తే వాల్లను ఇంటరాగేట్ చేస్తాడు. ఉమేష్ గురించి ఎప్పటి నుంచి తెలుసు అని, ఎందుకు బ్లాక్ మెయిల్ చేశాడు లాంటి ప్రశ్నలు అడుగుతారు. ప్రభాకర్ ప్లేస్ లో ఉమేష్ మాట్లాడుతూ తాను సెక్స్ ఎడిక్ట్ అని అందుకోసమే ఇలాంటి పరిస్థితులు వచ్చాయి అని చెప్తాడు. ఉమేష్ కు మీకు ఏంటి సంబంధం అని స్వాతిని అడిగితే తనకేమి తెలియదు అని చెప్తుంది. అక్కడి నుంచి కార్లో వస్తూ తుపాలి మర్డర్ గురించి మాట్లాడితే తనకేమి తెలియదు అని స్వాతి చెప్తుంది.
మరో సీన్లో చార్లెస్ పోలీసుతో మాట్లాడుతాడు. ఉమేష్ గురించి తెలుసా అంటే తెలియదు అని పోలీసు చెప్తాడు. తరువాత సీన్లో హస్సన్ ఇంటరాగేట్ వాయిస్ వింటుంటే అక్కడే తుపాలి కనిపిస్తాడు. హస్సన్ అదే మళ్లీ రిపీట్ చేస్తుంటే అంతలో అక్కడికి లేడీ పోలీసు వస్తుంది. తరువాత సీన్లో స్వాతి, ఉమేష్ ఆఫీస్ కు వస్తారు అందరూ సర్ ప్రైజ్ చేస్తారు. తరువాత కీర్తిమతో మాట్లాడితే తన ఆఫీస్ అంతా లాస్ లో ఉందని, స్వాతి పేరుతో అప్పులు తీసుకున్నట్లు చెప్తుంది. కట్ చేస్తే ఇంటికొచ్చి ఒకరిమీద ఒకరు అరుచుకుంటారు. అన్ని అప్పులు ఎలా కట్టాలి లేదంటే జైలుకు పోవాలి అని స్వాతి అరుస్తుంది. నీకోసమే కన్ను పోగొట్టుకున్నాను అని కోపంతో స్వాతిని కొట్టబోతుంటే స్యాండీ వచ్చి అరుస్తాడు.
తరువాత సీన్లో క్లబ్ నడిపే వారిని తీసుకొచ్చి పోలీసులు కొడుతారు. తుపాలి బైక్ మీ దగ్గరకు ఎలా వచ్చింది అని హాస్సన్ అడుగుతాడు. తరువాత 2 కోట్లు ఇవ్వమని బ్లాక్ మెయిలర్ మెయిల్ చేస్తాడు. ఎవరైంటారు అని ఉమేష్ ఆలోచిస్తాడు. తరువాత స్వాతి పడుకొని ఉంటుంది. నేనే నిన్ను మోసం చేశానా అని ఉమేష్ వెళ్లిపోతాడు. తరువాత సీన్లో అప్పు, స్యాండీ మాట్లాడుకుంటు స్మోక్ చేస్తారు. అదే సమయంలో ఉమేష్ కార్లో బయటకు వెళ్తాడు. కీర్తిమకు కాల్ చేసి మనీ కావాలి అని చెప్తాడు. తనకు వినపడడం లేదని తను కల్నరి ఆర్ట్స్ లో ఉన్నా అంటుంది. మరో సీన్లో తుపాలి బైక్ అడవిలో దొరికింది అని ఒక మనిషి హాస్సన్ కు చెప్తాడు. ఆ బైక్ వీళ్లకు అమ్మేశాను అని చెప్తాడు. వాళ్లను దొంగ కేసులు పెట్టి బుక్ చేయండి అని చెప్తాడు. తరువాత కుక్కకు హాస్సన్ బుక్ స్మెల్ చూపించి పంపిస్తాడు.
తరువాత సీన్లో స్వాతి వెజిటేబుల్స్ కట్ చేస్తుంటే చేయి తెగుతుంది. అదే సమయంలో స్వాతి కుకింగ్ టీచర్ వస్తుంది. నువ్వు మర్డర్ చేసినట్లు ఎవరికి చెప్పలేదు అని బ్లాక్ మెయిల్ చేస్తుంది. అదే సమయంలో పోప్ మాడిపోయిందని అప్పు అరవడంతో స్వాతి వెళ్లి దాన్ని సింక్ లో పడేసి తనను పట్టుకొని ఏడుస్తుంది. తరువాత అంకుల్ బిజినెస్ బాగానే రన్ అవుతుంది కదా మరెందుకు టెన్షన్, ఆయన అకౌంట్స్ అన్ని చూశాను అని చెప్తుంది. దాంతో ఆ బ్లాక్ మెయిల్ చేసింది నువ్వా అని స్వాతి డౌట్ పడుతుంది. మరో సీన్లో కల్కర్ ఆర్ట్స్ వెళ్తాడు అక్కడ కీర్తిమ ఫర్మామ్ చేస్తుంది. తరువాత అప్పు నువ్వు చిన్న పిల్లవి ఇలా ఎలా బ్లాక్ మెయిల్ చేస్తున్నావ్ అని అంటుంది. దాంతో మనిద్దరం కలిసి చేద్దాం.. నేను 2 కోట్లు అడిగాను కదా, ఇప్పుడు 5 కోట్లు అడుగుదాం అని అంటుంది. దాంతో మేము దివాల తీసేశాము అని స్వాతి చెప్తుంది.
నెక్ట్స్ సీన్లో నాడర్ ఇంట్లోకి చార్లెస్ వస్తాడు. అది గమనించిన నాడర్ తల్లి లేచి స్టోర్ రూమ్ కి వెళ్తుంది. చార్లెస్ అటు ఇటు వెతికి ఓ లాఫింగ్ బుద్ద ను ఓపెన్ చేసి అందులో కొన్ని ఫోటోలను తీసుకుంటాడు. అవి ఉమేష్, స్వాతి ప్రయివేట్ ఫోటోలు. కల్నరి ఆర్ట్స్ అయిపోయిన తరువాత అక్కడకి స్వాతి వస్తుంది. అదే సమయంలో కీర్తిమతో మాట్లాడుతుంటాడు ఉమేష్. కంపెనీ అకౌంట్లో కోటి రూపాలు ఉన్నాయి అన్నావ్ కదా అంటూ జారీగానే తనను పట్టుకుంటుంది. కిస్ చేస్తుంది. అదే సమయంలో అక్కడికి స్వాతి వచ్చి చూసి కోపంతో వెళ్లిపోతుంది. మరో సీన్లో సూర్యతో అరవింద్ మాట్లాడుతుంటాడు. అప్పు వస్తుంది. తనను పిలిచి కూర్చుబెట్టి మాట్లాడుతుంటే అక్కడికి చార్లెస్ వస్తాడు. అదే సమయంలో నీ వ్యాపారం ఒక క్రైమ్. నువ్వు ఒక గుండావి అని అంటుంది. కోపంతో తనను కొడుతాడు. తనపై అరుస్తు వెళ్తుంటే చార్లెస్ ఆపుతాడు.
మరో సీన్లో హాస్సన్, ఆశ తుపాలి చివరిగా వెళ్లిన అడవి ప్రాంతంలో వెతుకుతుంటారు. అక్కడ మినుగురులు కనిపిస్తాయి. వాటిని వెతుకుతూ హస్సన్ వెళ్తాడు. అక్కడే పాతి పెట్టిన చోట కుక్క కాళ్లతో గీకుతుంది.
స్వాతి సూప్ చేస్తుంది. అప్పు ఈ సమయంలో రావడం ఏంటి అని అరవింద్ ఫోన్ చేస్తుంటాడు అని ఉమేష్ అంటాడు. సూప్ తీసుకెళ్లి అప్పుకి తాగమని ఇస్తుంది. ఇది కరెక్ట్ కాదని ఉమేష్ అంటుండగా.. ఈ సారి ప్లాన్ నేను చేస్తా అని మీరు నన్ను కిడ్నాప్ చేయండి. మా డాడిని 5 కోట్లు అడగండి అని అంటుంది. ఇది కరెక్ట్ కాదని అంటున్నా అలాగే చెప్తుంది. దాంతో స్వాతికి కోపం వచ్చి ప్లేట్స్ ఎత్తేసి వెళ్లిపోతుంది. తనతో పాటే ఉమేష్ వెళ్తాడు. అతనిపై ముఖంపై దిండు విసిరేసి డోర్ వేస్తుంది.
హాస్సన్ తుపాలి జారిపడ్డ ప్లేస్ కు వెళ్తాడు. ఆ గోతిలో ఏం దొరికింది అంటే ఒక ఫోటో చూపిస్తుంది. తరువాత గోతిలో శవం కుల్లిపోయి ఉంటుంది. అక్కడే కెమెరా దొరుకుతుంది. మరో సీన్లో స్వాతి ఇళ్లంత క్లీన్ చేస్తుంది. అదే సమయంలో అరవింద్ ఫోన్ చేస్తాడు. తనను త్వరగా ఇంటికి పంపించు అని లేదంటే నీ అంతు చూస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. స్వాతి షాక్ చూస్తుంది. మరో సీన్లో అరవవింద్ అప్పు గదిలో డ్రగ్స్, పేపర్స్ చూసి కొప్పడుతాడు. మరోసీన్లో అప్పు ఇంటికి వెళ్లిపోతున్నా అంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉందని చెప్తుంది.
తరువాత హాస్సన్ స్నానం చేస్తుంటే ఆ కేసు గుర్తుకు వచ్చి మళ్లీ స్పాట్ కు వెళ్తాడు. అక్కడ తుపాలి పడిపోయినట్లు కల కంటాడు. ప్లాన్ నచ్చిందని అప్పు చెప్తుంది. స్యాండీ వస్తే అతన్ని తిట్టి పంపిస్తారు. ఈ పని నువ్వు చేస్తావా అని ఉమేష్ ను అడుగుతారు. నా వల్ల కాదని చెప్తాడు. తరువాత స్యాండీతో కలిసి క్రికెట్ ఆడుతుంటే అప్పు, స్వాతి మాట్లాడుకుంటారు. వదిలేయండి ఆంటీ అంకుల్ ఇష్టం లేదని చెప్తుంది. నేను ఒప్పిస్తా అంటుంది. తరువాత ఉమేష్ వచ్చి జరిగిన దానికి సారీ చెప్పి నువ్వు ఏది చెబితే అదే చేస్తా అంటాడు. స్వాతిని హగ్ చేసుకొని ఏడుస్తాడు. అప్పును తీసుకొని అరవింద్ దగ్గరకు బయలుదేరుతాడు. అదే సమయంలో అక్కడ చార్లెస్ ఉంటాడు.
నెక్ట్స్ సీన్లో సూర్యతో మష్రూమ్స్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటాడు. డీల్ సెట్ చేయడానికి సాయంత్రం వరకు టైమ్ ఇస్తున్నట్లు చెప్తాడు. అదే సమయంలో అక్కడికి ఉమేష్ వచ్చి ఒక ప్రాబ్లమ్ వచ్చిందని చెప్తాడు. ఏంటంటే ఉమేష్ వచ్చాడు అని చెప్తాడు. తరువాత స్వాతి, అప్పు ప్లాన్ చేసుకుంటుంటే అక్కడికి చార్లెస్ వచ్చి అప్పును తీసుకొని వస్తాడు. మరో సీన్లో అరవింద్ దగ్గర 31 కోట్లు కోట్టేసినట్లు చెప్తాడు. దానికి అరవింద్ చెప్పుతో కొడుతాడు. స్వాతి ఇంట్లో చార్లెస్ తనను తీసుకెళ్లలని చూస్తే స్వాతి అడ్డు పడుతుంది. దాంత స్వాతికి ఉమేష్ తో ఉన్న సంబంధం గురంచి చెప్తాడు. అప్పును తీసుకొని వెళ్తుంటే స్వాతి అడ్డు పడుతుంది. అతను చెప్పమీద కొడుతాడు. నీ గురించి నాకు నిజం తెలుసు, స్వాతి వాళ్ల అమ్మతో నీ సంబంధం గురించి నాకు తెలుసు అని చెప్తుంది. అదే సమయంలో అప్పు బ్యాట్ తో కొడుతుంది. చార్లెస్ కిందపడిపోతాడు.
తరువాత 5 కోట్లు ఇచ్చేయ్ అన్నయ్య అని ఉమేష్ అంటాడు. లేదంటే మీడియాకు తెలిసిపోతుంది అని అంటాడు. తరువాత చార్లెస్ ను తీసుకొని వెళ్తుంటే స్యాండీ వస్తాడు. అతన్ని తీసుకొని రూమ్ కు వెళ్తుంది. మ్యాజిక్ వింటుంటారు. అదే సమయంలో చార్లెస్ ను తీసుకొని స్టోర్ రూమ్ లో కట్టేస్తుంది. మత్తు ఇంజక్షన్ ఇస్తుంది. అక్కడికి అప్పు వస్తుంది. అదే సమయంలో ఉమేష్ వస్తాడు. వాల్ల దగ్గర మరో ప్లాన్ ఉందని అంటారు.
తరువాత అప్పు సూర్యరూమ్ కు వెళ్లి వాళ్ల డాడి బిజినెస్ గురించి డిటైల్స్ అడుగుతుంది. నెక్ట్స్ మానిక్యంతో డీల్ ఫిక్స్ చేస్తాడు అరవింద్. డబ్బులు లెక్కపెట్టి ఉమేష్ ఇచ్చి పంపిస్తాడు. డబ్బు తీసుకొని కార్లో వెళ్తుంటే వెనుకాలే అరవింద్ మనుషులు ఫాలో అవుతారు. డబ్బు ఎవరికి ఇచ్చారో చూడండి అని అరవింద్ చెప్తాడు. తరువాత సీన్లో బాడీని పోస్టట్ మార్టమ్ చేసిన డాక్టర్ ఈ ఫీచర్స్ అన్ని ఉమేష్ కు సరిపోతున్నాయి అని చెప్తాడు. అదే సమయంలో ఆ బాడీ చేతుల్లో ఏదో పట్టుకున్నాడు అని ఓపెన్ చేస్తే బాబి పిన్ దొరుకుతుంది.
ఉమేష్ డబ్బులు తీసుకొని స్పీడ్ బోట్ ఎక్కుతాడు. వెనుకాలే అరవింద్ మనుషులు ఉంటారు. వారిని తప్పించుకొని డబ్బులు తీసుకొని ఇంటికి రాగానే అరవింద్, సూర్య ఉంటారు. తరువాత మనిషా కోయిరాల కోసం హాస్సన్ వెతుకుతున్నట్లు ఆశతో చెప్తాడు. తరువాత వీరంత దొరికిపోయారని స్వాతి సారీ చెప్తుంది. అరవింద్ కొడుతాడు. ఎందుకొట్టావు అని అప్పు అరుస్తుంది. స్యాండీ వస్తాడు అతన్ని వెళ్లిపో అంటారు అతను బయటకు వెళ్లగానే చార్లెస్ వస్తాడు. అందరూ హాల్లో ఉన్నారు అని చెప్తాడు. ఇంట్లోకి వెళ్లగానే అప్పు గన్ తో బెదిరిస్తుంది. తరువాత తన తలకు పెట్టుకొని బెదిరిస్తుంది. దీనింతటికి కారణం స్వాతి అని అరవింద్ అరుస్తుంటే అసలు విషయం నేను చెప్తాను అని స్వాతి అంటుంది. అదే సమయంలో గన్ ను లాక్కోవాలని అరవింద్ చూస్తాడు అది ట్రిగ్గర్ అవుతుంది.
కీర్తిమ ప్రభాకర్ కు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదని ఇంటికి వస్తుంది. అక్కడ గొడవ జరుగుతుంది. దాన్ని కీర్తిమ వీడియో తీస్తుంది. ఆ గన్ షాట్ లో అరవింద్ పడిపోతాడు. తనను ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్తాడు. తనను ఆసుపత్రికి తీసుకెళ్తారు. అక్కడ అరవింద్ బతికితే నా కన్న ఎక్కవగా నీకే ప్రమాదం అని స్వాతి అంటుంది. కోపంతో స్వాతి మెడపట్టుకుంటాడు. సూర్య రావడంతో అతను వెళ్లిపోతాడు. తరువాత స్వాతీ టీచర్ ఇంటికి హాస్సన్, ఆశ వస్తారు. మనిషా కోయిరాల గురించి అడుగుతారు. తను మూడు హత్యలు చేసిందని చెప్తాడు. తన గురించి ఏం తెలియదు అని చెప్తుంది. అదే సమయంలో అరవింద్ శెట్టిని ఎవరో షూట్ చేశారు అని చెప్తాడు. మరో సీన్లో ఆసుపత్రిలో స్వాతి, ఉమేష్ మాట్లాడుకుంటారు. చార్లెస్ తో జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది. కట్ చేస్తే ఫ్యామిలీతో హాస్సన్ మాట్లాడుతాడు. ఎలా జరిగింది అంటే ఫ్యామిలీ పార్టీలో తనకు తానే కాల్చుకున్నాడు అని చెప్తుంది. పోలీసులు పదే పదే అడుగుతుంటే తాను కాల్చినట్లు అప్పు చెప్తుంది.
తరువాత టాయిలెట్స్ లో ఉదయ్, హాస్సన్ మాట్లాడుకుంటారు. నువ్వు ఇక్కడే ఉండూ అని ఉదయ్ చెప్పి వెళ్తాడు. ఆ ఫ్రస్టేషన్లో గ్లాస్ పగలగొడుతాడు హాస్సన్. తరువాత అరవింద్ కు ఆపరేషన్ చేస్తారు. డాక్టర్ వచ్చి ఆయన లంగ్స్ కొంచెం డీప్ కట్ అయ్యాయి అని చెప్తాడు. అదే సమయంలో హాస్సన్ వచ్చి స్వాతితో మాట్లాడుతాడు. తను అర్టెంట్ పనిమీద వెళ్లాలని కానీ వాళ్ల బాస్ ఇక్కడే ఉండమని ఆర్డర్ వేశాడని చెప్తాడు. పర్లే అరవింద్ కు సృహ వస్తే నేను కాల్ చేస్తా అని స్వాతి అంటుంది. తాను వెళ్తాడు. అక్కడ అరవింద్ పోస్టర్ చూసి డౌట్ వస్తుంది. నెక్ట్స్ సీన్లో డాక్టర్ వచ్చి అతని ప్రాణినికి ఏం ప్రమాదం లేదని చెప్తాడు. అందరూ ఊపిరి పీల్చుకుంటారు. స్వాతి వెళ్లిపోతుంది. హాస్సన్ వచ్చి అరవింద్ శెట్టిని కలువాలని చెప్తే డాక్టర్ ఒప్పుకోడు. స్వాతి అరవింద్ రూమ్ కు వెళ్తుంది. తన మాస్క్ తీస్తే అతను తన గొంతు పట్టుకున్నట్లు కల కంంటుంది. అదే సమయంలో అక్కడికి డాక్టర్ వచ్చి అతను బతికే ఛాన్స్ చాలా తక్కువగా ఉందని చెప్తాడు. స్వాతి ఆలోచనలో పడుతుంది.
తరువాత స్వాతిని ఉమేష్ పిలుస్తుంటే. కీర్తిమ వస్తుంది. ఇద్దరు మాట్లాడుకుంటుంటే స్వాతి కోపంతో ఉమేష్ ను తీసుకొని వెళ్తుంటే వీరిద్దరి నడుమ ఎఫైర్ ఉందని చెప్తుంది. స్వాతి కోపంతో నిన్ను ఉద్యోగంలోంచి తీసేసినట్లు చెప్తుంది. మరో సీన్లో హాస్సన్, ఆశ అరవింద్ ను చూడడానికి వెళ్తారు. ఆశ బయట ఉంటుంది. హాస్సన్ లోపలికి వెళ్లి అరవింద్ తో మాట్లాడుతాడు. మనిష కోయిరాల ఎవరు అని అడగితే అరవింద్ చెప్పడు. తరువాత సీన్లో ఆశ డాక్టర్ తో మాట్లాడుతూ ఓల్డ్ ఫోటో చూస్తుంది. అందులో ఉమేష్ ఉంటాడు. స్వాతి, ఉమేష్ ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్తాడు. అదే సమయంలో అరవింద్ అరుస్తుంటే అక్కడికి డాక్టర్ వెళ్తాడు.
తరువాత సీన్లో ఇంట్లో బ్లడ్ క్లీన్ చేస్తుంటే అక్కడ మనీ బ్యాగ్ ఉంటుంది. ఇద్దరు కిస్ చేసుకుంటారు. మరో సీన్లో స్వాతి చెఫ్ కోచ్ దగ్గరకు హాస్సన్ వస్తాడు. మనిషా కోయిరాల గురించి అడుగుతాడు. ఆశ డాక్టర్ తో స్వాతి గురించి అడుగుతుంది. తరువాత హాస్సన్ మనిషా కొరియాల గురించి తను చెప్తుంటే ఆ ఫ్యూచర్స్ అన్ని స్వాతికి సరిపోయేలా ఉన్నాయి అని తెలుసుకుంటాడు. తరువాత నువ్వు చేసేది తప్పు అని ఉమేష్ అంటాడు. అదే సమయంలో హాస్సన్ వస్తాడు. మీకు ఉమేష్ కు ఏంటి సంబంధం అని అడుగుతాడు. ఉమేష్ కు స్వాతికి ఎఫైర్ ఉందని చెప్తాడు. స్వాతి అరుస్తుంది. హాస్సన్ ఉమేష్ పై చేయి చేసుకుంటాడు. అదే సమయంలో కళ్లు తిరిగి పడిపోతాడు. అతన్ని ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ చేస్తాడు. అరవింద్ బతికాడు అని చెప్తాడు.
తరువాత ఇది ఫ్యామిలీ మ్యాటర్ దీనిలో ఎవరు ఇన్వాల్వ్ అవకండి అని డీఎస్పీ ఉదయ్ తో చెప్తాడు. ఈ కేసు గురించి చాలా విషయాలు చెప్పాలి అని హాస్సన్ అంటుంటే ఇంకేమి మాట్లాడకు అని అంటాడు. తరువాత అరవింద్ ను చూడడానికి అందరూ వెళ్తారు. కేవలం అప్పుతో మాట్లాడాలని చెప్పి నీకు నచ్చినట్లు బతికు అని చెప్తాడు. అరవింద్ ఎమోషనల్ అయి చనిపోతాడు. అందరూ వచ్చి ఏడుస్తుంటారు. కీర్తిమ నుంచి వీడియో వస్తుంది.
అందరూ అరవిందుకు శ్రద్దంజలి గడిస్తుంటారు. అక్కడికి స్వాతి వస్తుంది. భోజనాలు పెడుతుంటారు. ఉమేష్ మందు బాటిల్ తీసుకుంటాడు. అదే సమయంలో స్వాతి వస్తుంది. నువ్వు అరవింద్ తమ్ముడివి అంటే నేను కాదు అని చెప్తాడు. తరువాత సూర్య వచ్చి ఫోటోను చూసి నవ్వుతాడు. అప్పుతో మాట్లాడుతాడు.నెక్ట్స్ సీన్లో స్యాండీ అప్పు మాట్లాడుతుంటే అక్కడికి స్వాతి టీచర్ వస్తుంది. తనతో మాట్లాడడానికి వస్తుంది. పోలీసులు నిన్ను వెతుకుతున్నారు అని చెప్తుంది. కట్ చేస్తే వీలునామ గురించి లాయర్ మాట్లాడుతుంటాడు. అన్ని ఆస్తులు అప్పు పేరుమీదనే రాశాడు అని చెప్తాడు. తరువాత మిగితా వారికోసం కూడా చిన్న ఆస్తులు రాసినట్లు చెప్తాడు. స్వాతి కోసం ఏం రాయడు.
తరువాత సీన్లో స్వాతి, ఉమేష్ మాట్లాడుకుంటారు. అక్కడకి పోలీసులు వచ్చి గొడవ చేస్తారు. అదే సమయంలో అక్కడే ఉన్న వాళ్ల మనుషులు గన్స్ తీసుకొని వస్తారు. చార్లెస్ హాస్సిన్ ను బెదిరిస్తాడు. దాంతో హాస్సిన్ స్వాతి టీచర్ ను తీసుకొని వెళ్లిపోతాడు. తరువాత కీర్తిమ కలుద్దామని మెసేజ్ చేస్తుంది. తనను కలిసి అక్కడే ఉన్న టోస్ట్ లను తింటాడు. మరో సీన్లో స్వాతి టీచర్ మనిషా కోయిరాల ఎవరు అని అడుగుతారు. తను చెప్పదు, తనను జైల్లోకి తీసుకెళ్తుంటే స్వాతి లాయర్ తో వస్తుంది. మరో సీన్లో కీర్తిమ, ఉమేష్ మాట్లాడుకుంటారు. ప్రభాకర్ నీ డ్రీమ్స్ అన్ని ఏమైయ్యాయి. స్వాతికి డివోర్స్ ఇస్తా అన్నావు, హోటల్ స్టార్ట్ చేయాలన్నావు అని అంటుంది. ముందులా ఉండూ అని ఉమేష్ తో మాట్లాడుతుంటే. ఉమేష్ ఎమెషనల్ అవుతాడు. తరువాత ఇద్దరు కిస్ చేసుకుంటారు.
తరువాత నీకు ముందే చెప్పాను ఇలాంటిదేదో అవుతుందని ఉదయ్ హస్సన్ పై కొప్పడుతాడు. తనను తీసుకొని వెళ్తుంటే స్వాతి నిన్ను వదిలిపెట్టను అని హాస్సన్ అంటాడు. తరువాత టీచర్ కు డబ్బులు ఇచ్చి ఆ బ్యూటిపార్లల్ ఆమె నా గురించి ఏం చెప్పొద్దు అని చెప్తుంది. తరువాత కీర్తిమ ఫోన్ చేసి కలుద్దాం అని అంటుంది. ప్రభాకర్ ఎక్కడ అంటే తెలియదు అని చెప్తుంది. మరో సీన్లో సూర్యతో డీల్ కాన్సిల్ చేస్తుంది అప్పు. అదే సమయంలో చార్లెస్ ఫోన్ చేసి అప్పుపై కొప్పడుతాడు. నాకు ఏం చేయాలో తెలుసు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. తరువాత హస్సన్ నాడర్ ఇంటికి వెళ్లి కంప్యూటర్ చెక్ చేస్తుంటే నాడర్ తల్లి వస్తుంది. ఇక్కడికి ఎవరన్నా వచ్చారా అంటే ఎవరో వచ్చారు తనను బెదిరించారు అని చెప్తుంది. అతని గురించి అడిగుతాడు.
తరువాత కీర్తిమ స్వాతిని వెతుక్కుంటూ ప్రభాకర్ హోటల్ కు వెళ్తుంది. తాను షూట్ చేసిన వీడియో చూపించి నాకు ప్రభాకర్ కావాలి అని అంటుంది. అదే సమయంలో చార్లెస్ వచ్చి కీర్తిమ మేడను తాడుతో బిగిస్తాడు. తను కలరి విద్యాతో చార్లెస్ ను కొడుతుంది. తరువాత స్వాతిని బెదిరిస్తుంది. గన్ తీసి కాల్చేలోగా అది ట్రిగ్గర్ అవదు. కీర్తిమ నవ్వుతూ చెప్పులు జారీ కిందపడి చనిపోతుంది. ఆ బాడీని మాయం చేయమని చెప్తుంది. నెక్ట్స్ చార్లెస్ కోసం హాస్సన్ ఇంటికి వెళ్తాడు. అక్కడ తను ఉండడు. మరో సీన్లో ఉమేష్ కీర్తిమ ఇంట్లో నిద్రలేచి బయట ఎవరో ఉన్నారు అని తప్పించుకోవడానికి చూస్తాడు. అక్కడే ఉమేష్ చేతి కర్ర కనిపిస్తుంది. మరో సీన్లో హాస్సన్ చార్లెస్ ఇల్లంత వేతుకుతాడు. ఏం దొరకదు. ఒక పెట్టోలో లెటర్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తే అందులో స్వాతి, ఉమేష్ ప్రయివేట్ ఫోటోలు దొరుకుతాయి.
తరువాత వాటిని తీసుకొని కీర్తిమ ఇంటికి వెళ్లగానే తనకు ఉమేష్ కు మధ్య ఎఫైర్ ఉందని ఉదయ్ చెప్తాడు. తన దగ్గర ఫోటోలపై లిక్విడ్ పడడంతో అవి పాడు అవుతాయి. కీర్తిమ సూసైడ్ చేసుకుందని న్యూస్ వస్తుంది. అది చూసి ఉమేష్ షాక్ అవుతాడు. తరువాత సీన్లో స్వాతి రెస్టారెంట్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది. దాంతో స్వాతి సంతోషపడుతుంది. కీర్తిమ బాడీ దగ్గరకు ఉమేష్ వస్తాడు. హాస్సన్ అలానే చూస్తూ ఉంటాడు.
నెక్ట్స్ సీన్లో ఉమేష్ స్వాతి దగ్గరకు వచ్చి కీర్తిమ చనిపోయిందని చెబుతాడు. స్వాతికి ఏమి తెలియనట్లు నటిస్తుంది. తనతో పడుకున్నావా అంటే లేదు అని చెప్తాడు దాంతో ఉమేష్ కొట్టి లోపలికి వెళ్లి చార్లెస్ కు ఫోన్ చేసి చెప్తుంది. ఎం పర్లేదు నేను చూసుకుంటా అంటాడు. మరో సీన్లో స్వాతి రెస్టారెంట్ కోసం పూజ జరుగుతుంది. అక్కడికి చార్లెస్ రావడం చూసి ఉమేష్ బీర్ బాటీల్ తీసుకొని వెళ్లి గొడవ చేస్తాడు. అమయకురాలిని చంపేశావు అని ఉమేష్ అంటాడు. అదే సమయంలో స్వాతి వచ్చి అతన్ని సేవ్ చేస్తుంది. నువ్వు కీర్తిమతో చేసింది మరిచిపోతా… నీకు ఇంకో ఛాన్స్ ఇస్తా అని చెబుతుంది. మరో వైపు హాస్సన్ సెర్చింగ్ చేస్తుంటాడు. ఉమేష్ ను కలిసి తనను ప్రభాకర్ అనుకొని నీ భార్య అంతా చేసింది. నీ మీద యాసిడ్ ఎటాక్ కూడా జరగలేదు. నువ్వే ఇలా చేసుకున్నావు కదా.. ఉమేష్ ను చంపి బాడీని పూడ్చి పెట్టారు అని అంటాడు. అలోచించుకో అని టాయిలెట్ యూస్ చేసుకుంటుంటే అక్కడ యాసిడ్ బాటిల్ కనిపిస్తుంది. దాన్ని తీసుకొచ్చి ఇదేనా బాటిల్ అంటే. కీర్తిమా పోస్ట్ మర్టమ్ రిపోర్ట్స్ చూసి ఉమేష్ బాధపడుతాడు. అక్కడ ఒక లవ్ లెటర్ దొరుకుతుంది. స్వాతి ఉమేష్ ఎలా ప్రేమించుకున్నారో, ప్రభాకర్ కీర్తిమా కూడా అలానే ప్రేమించుకున్నారు అని ఆలోచిస్తాడు. దాంతో ఉమేష్ కోపంతో హాస్సన్ వెళ్లిపో అంటాడు.
నెక్ట్స్ ప్రభు అనుకుంటూ స్వాతి ఇంట్లోకి వస్తుంది. తనను వెనకనుంచి పట్టుకొని నేను ఎప్పటికి నీతోనే ఉంటా అని అంటాడు. మరో సీన్లో హస్సన్ ఫెర్వల్ పార్టీ జరుగుతుంది. ప్రభాకర్ మీద డౌట్ ఉందని హాస్సన్ అనగానే ఉమేష్ కోప్పడి, ఆశను ప్రమోట్ చేసి హాస్సన్ ను తీసెస్తున్నా అంటాడు. దాంతో హాస్సన్ కొప్పడి నేనే రిజైన్ చేస్తున్నా అక్కడినుంచి కేక్ తీసుకుని వెళ్లిపోతాడు. మరో సీన్లో స్వాతి టీచర్ తో పాటు సూప్ లో కలిపే మసాలా కోసం అడవిలోకి వెళ్తుంది. అక్కడ ఒక చనిపోయిన జింక కడుపులో పుట్టగొడుగులను తీసుకొని వస్తారు. ఒక వైపు రెస్టారెంట్ రెడీ అవుతుంది. మరో వైపు హస్సన్ స్వాతిపై అనుమానంతో వెతుకుతూ ఉంటాడు. అదే సమయంలో అతని కారు బ్రేక్ డౌన్ అవుతుంది.
ఆ రాత్రి స్వాతి రెస్టారెంట్ ఓపెనింగ్ పార్టీ జరుగుతుంది. అందరికి సూప్ పంచుతారు. పార్టీలో అంతా హడావిడాగా ఉంటుంది. తరువాత స్వాతి మాట్లాడుతూ అప్పుకు, తన కొడుకు, తన హస్బెండ్ కు థ్యాంక్స్ చెబుతుంది. పార్టీ సరదాగా జరుగుతుంది. అక్కడికి చార్లెస్ వచ్చి అప్పుతో మాట్లాడుతాడు. వాళ్ల అమ్మ గురించి నిజం చెప్తా అంటే అవసరం లేదు నువ్వు నాతో ఉండు చాలు అంటుంది. దాంతో ఇద్దరు ఎమోషనల్ గా హగ్ చేసుకుంటారు. మరో సీన్లో ఉదయ్ సూప్ చాలా బాగుందని అంటూ తాగుతాడు. హస్సన్ గురించి అడిగి అతనో పిచ్చోడు అని నవ్వుతుంది. అదే సమయంలో హస్సన్ ఉమేష్ కలిసిన విషయం చెబుతాడు. దాంతో స్వాతి డౌట్ పడుతుంది. తెలిసి కూడా ఎందుకు చెప్పలేదు అని అనుకుంటుంది. ఉమేష్ దగ్గరకు వెళ్లి నీతో మాట్లాడాలి అంటుంది.
మరో సీన్లో హాస్సన్ అడవిలో ఉన్న ఒక కొట్టుదగ్గరకు వెళ్లి ఫోన్ చేసుకోవాలిన ఆశకు ఫోన్ చేసి రమ్మంటాడు. తరవాత పోస్ట్ మర్టం డాక్టర్ ఫోన్ చేసి ఆ బాడీ ఉమేష్ ది కాదు అని చెప్తాడు. ఆశ షాక్ అవుతుంది. తరువాత అక్కడ యాసిడ్ బాటిల్ చూస్తాడు హాస్సన్. దాంతో వీళ్లను ఇక్కడ చూశావా అంటే చూశాను కానీ అతను గడ్డంతో ఉన్నాడు. మెల్ల కన్ను కూడా ఉంది అని నవ్వుతాడు. దాంతో హాస్సన్ కు డౌట్ వస్తుంది. మరో సీన్లో టేస్ట్ మసలా ఒక స్పూన్ వేస్తే స్వర్గం, ఎక్కువేస్తే నరకం అని స్వాతి టీచర్ చెబుతుంది. అదే సమయంలో ఉమేష్ పిలుస్తాడు. స్వాతి అతనికి సూప్ ఇచ్చి తాగమంటుంది. అది చాలా బాగుందని, ఇంతముందు నువ్వు చేసిన సూప్ బాగుండేది కాదని అయినా నువ్వు బాధ పడుతావని తాగేవాన్నని చెబుతాడు. కీర్తిమను చంపింది నేనే అని తెలసినా ఎందుకు నన్ను అడగలేదు అని స్వాతి అంటుంది. ఉమేష్ ఏం చెప్పడు సూప్ తాగుతుంటాడు. అదే సమయంలో హాస్సన్ వచ్చాడు అని స్వాతి టీచర్ పిలుస్తుంది. సూప్ బాగుందని టేస్టీ పౌడర్ ను ఎక్కువ వేసుకొని తాగేస్తాడు. స్వాతి అతన్ని వెతుకుతూ హాస్సన్ కు పట్టుబడుతుంది.
మరో సీన్లో ఉమేష్ డయాస్ మీద మాట్లాడుతుంటాడు. ఇక అందరి ముందు నిజం చెప్తేస్తాడు. తాను ఉమేష్ అని, స్వాతి తాను ప్రేమించుకున్నట్లు అందుకే ప్రభాకర్ ను చంపేసి పాతిపెట్టినట్లు చెప్తాడు. సూప్ ఎక్కువ తాగడం వలన కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. తరువాత గన్ తీసుకొని స్వాతిని కాల్చేయబోతాడు. తనకు తానే గన్ పెట్టుకుంటాడు వైర్లు తాకి కిందపడుతాడు. దాంతో స్వాతి గన్ పెట్టి నేను ఎవరిని చంపలేదు అని చెబుతుంది. అన్ని అనుకోకుండా జరిగాయి అని చెప్తుంది. గన్ ఫైర్ చేస్తుంది. అదే సమయంలో ఉమేష్ బ్లడ్ వాప్టింగ్ చేసుకుంటాడు. అతన్ని కార్లో హాస్పటల్ కు తీసుకెళ్తారు. హాస్సన్ వెనక్కి వస్తే స్వాతి గన్ పట్టుకొని సూసైడ్ స్వాట్లో వెనక్కి పడుతుంది. తరువాత కార్లో ఉమేష్ తప్పించుకుంటాడు. తరువాత స్వాతి కళ్లు తెరుస్తుంది. ఇద్దరు కలిసి బస్సలో కలుసుకుంటారు. బస్సు పైన తుపాలి ఉంటాడు. సిరీస్ ఎండ్ అవుతుంది.