కొన్నాళ్లు ‘మహానటి’గా అలరించిన కీర్తి సురేష్.. మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’తో రూట్ మార్చింది. కళావతిగా కొత్తగా కలరింగ్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ గ్లామర్ డోస్ పెంచేసింది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతోంది. అయినా అమ్మడి చేతిలో ఒకటి అర సినిమాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం తెలుగులో న్యాచురల్ స్టార్ నాని సరసన ‘దసరా’ మూవీలో నటిస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి చెల్లెలిగా ‘భోళా శంకర్’ మూవీలో నటిస్తోంది. ఇవి తప్పితే ‘సర్కారు వారి పాట’ తర్వాత మరో బడా ఆఫర్ అందుకోలేకపోయింది. అయితే తాజాగా మరోసారి ఓ ఫీమెల్ సెంట్రిక్ మూవీ చేసేందుకు ఒకే చెప్పిందట కీర్తి. అది కూడా పెళ్లి కాకుండానే తల్లి కాబోయే పాత్రలో నటించనుందట.
హిందీలో కృతి సనన్ లీడ్ రోల్లో వచ్చిన ‘మీమీ’ అనే చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఈ సినిమాను తెలుగు, తమిళ భాషాల్లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కీర్తి సురేష్ ఈ రీమేక్‌కు ఓకే చెప్పినట్టు సమాచారం. అయితే గతంలో మహానటి సినిమా తర్వాత వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేసింది కీర్తి. కానీ ఆ సినిమాలతో ఏ మాత్రం అలరించలేకపోయింది. అందుకే గ్లామర్ హీరోయిన్గా యూ టర్న్ తీసుకుంది. ఇలాంటి సమయంలో మళ్లీ లేడీ ఓరియేంటెడ్ సినిమాతో రిస్క్ చేస్తుందా.. అనే సందేహం రాక మానదు. ఒకవేళ కీర్తి ఈ ప్రాజెక్ట్ టేకాఫ్ చేస్తే.. సరోగసీ పద్దతి ద్వారా పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన ఓ యువతిగా నటించాల్సి ఉంటుంది.