Sai Pallavi: హ్యాపీ బర్త్ డే లేడీ పవర్ స్టార్.. నెక్స్ట్ ఏంటి!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలాంటిదో అందిరికీ తెలిసిందే. అయితే హీరోల్లో 'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్. మరి లేడీ పవర్ స్టార్ ఎవరు? అంటే ఠక్కున సాయి పల్లవి అని చెప్పేస్తారు. మన లెక్కల మాస్టారు సుకుమారే స్వయంగా సాయి పల్లవికి లేడీ పవర్ స్టార్ బిరుదు ఇచ్చాడు. ఈ లెక్కన అమ్మడికి తెలుగులో ఏ రేంజ్లో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మే 9న ఈ క్యూట్ బ్యూటీ బర్త్ డే వేడుకలు జరుపుకుంటోంది.
తమిళనాడులోని ఊటీకి సమీపంలో ఉన్న కోత్తగిరి అనే చిన్న గ్రామంలొ జన్మించిన సాయి పల్లవి(Sai Pallavi).. డ్యాన్స్ షోలతో కెరీర్ మొదలు పెట్టింది. ఈటీవిలో వచ్చిన ఢీ షోతో డ్యాన్సర్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. జార్జియాలో వైద్య విద్యనభ్యసించింది. అయతే తమిళ దర్శకుడు అల్ఫోన్సో సాయి పల్లవికి ప్రేమమ్ సినిమా(Premam Movie)తో హీరోయిన్గా పరిచయం చేశాడు. అప్పటి నుంచి తెలుగు, తమిళ, మలయాళంలో వరుస సినిమాలు చేసింది. తెలుగు ఆడియెన్స్‌కు శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ సినిమా(Fida Movie)తో పరిచయం అయింది. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుని సొంతంగా తనకు తానే డబ్బింగ్ చెప్పుకుంది.
ఆ తర్వాత కెరీర్లో నిలిచిపోయేలా కొన్ని సినిమాలు మాత్రమే చేసింది అమ్మడు. అయినా కూడా సాయి పల్లవి(Sai Pallavi)కి ఉండే ఫాలోయింగ్ మరో హీరోయిన్‌కు లేదు. ఎందుకంటే.. ఆమె గ్లామర్‌కు దూరంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఏ సినిమాలోను స్కిన్ షో చేయలేదు. అసలు సాయి పల్లవి సినిమా ఒప్పుకుందంటే.. అందులో ఏదో విషయం ఉన్నట్టే లెక్క. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గ్లామర్ అనే పదానికి ఒక్కొక్కరూ ఒక్కో అర్థం చెబుతారు. నా దృష్టిలో గ్లామర్ అంటే నేను ఎంపిక చేసుకున్న పాత్ర ప్రేక్షకులకి చేరువవడం.. అని చెప్పుకొచ్చింది. మొహంపై మొటిమలతో తెరపై ఎలా కనిపిస్తానో అని భయపడినా తనకు.. ఊహించని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని చెప్పింది.
అయితే తెలుగులో చివరగా ‘విరాట పర్వం’ సినిమాలో నటించింది సాయి పల్లవి(Sai Pallavi). ఆ తర్వాత గార్గి అనే రీమేక్ సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చింది. కానీ ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ కమిట్ అవలేదు. దీంతో సాయి పల్లవి సినిమాలకు దాదాపుగా గుడ్ బై చెప్పేసిందన్న ప్రచారం జరిగింది. అయితే కథ నచ్చితే కచ్చితంగా సినిమా చేస్తానని చెప్పిన సాయి పల్లవి.. ఇటీవలే కొత్త ప్రాజెక్టుకు సైన్ చేసింది. తమిళ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా కమల్ హాసన్(Kamal Hasan) నిర్మిస్తోన్న ఓ సినిమాలో సాయి పల్లవి(Sai Pallavi) హీరోయిన్గా నటిస్తోంది. కానీ తెలుగులో మాత్రం కొత్త సినిమాకు సైన్ చేయలేదు. దాంతో మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై సాయి పల్లవిని చూసేందుకు ఎదురుచూస్తున్నామంటూ.. లేడీ పవర్ స్టార్‌కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు నెటిజన్స్.