Guntur Karam: మహేష్ ఫ్యాన్స్ ఇక రిలాక్స్.. యాక్షన్ మోడ్‌లో ‘గుంటూరు కారం’!
మాకే ఎందుకిలా? అని మహేష్ బాబు ఫ్యాన్స్ ఫీల్ అయిన సినిమా ఏదైనా ఉందా? అంటే, అది గుంటూరు కారం మాత్రమేనని చెప్పాలి. ఈ సినిమా గురించి ఇప్పటి వరకు పాజిటివ్ కన్నా నెగెటివ్ ప్రచారమే ఎక్కువగా జరిగింది. కానీ ఇకపై అలా ఉండదు అని అంటున్నారు మేకర్స్.
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి వస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. అతడు, ఖలేజా తర్వాత దాదాపు పుష్కర కాలానికి ఈ క్రేజీ కాంబో సెట్ అయింది. అందుకే ఈ కాంబినేషన్ అనౌన్స్మెంట్తోనే ఓ రేంజ్ బజ్ క్రియేట్ చేసింది. ఇక మహేష్ ఫస్ట్ లుక్ అండ్ ఫస్ట్ గ్లిమ్ప్స్ ఇదో ఊరమాస్ ప్రాజెక్ట్ అని చెప్పేశాడు త్రివిక్రమ్. అతడు, ఖలేజా సినిమాలు థియేటర్లో హిట్ కాలేదు గానీ.. ఈసారి మాత్రం బుల్లితెర కాకుండా బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేస్తాం అనే నమ్మకాన్ని ఇస్తున్నారు. కానీ ఈ సినిమా షూటింగ్ మాత్రం డిలే అవుతూ వస్తోంది.
ఏదో ఓ కారణంగా లేట్ అవుతునే ఉంది. కానీ రీసెంట్గా మహేష్ బాబు ఫారెన్ నుంచి తిరిగి రావడంతో.. గుంటూరు కారం షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. సెప్టెంబర్ 1 నుండి కొత్త షెడ్యూల్‌ను స్టార్ట్ చేయబోతున్నారు. ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. మహేష్ బాబు, జగపతి బాబు పై ఈ యాక్షన్‌ను చిత్రీకరించనున్నారట. ఈ ఫైట్‌ను రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఓ రేంజ్లో డిజైన్ చేసినట్లుగా తెలుస్తుంది. దీంతో ఘట్టమనేని ఫ్యాన్స్ కాస్త రిలాక్స్ అవుతున్నారు.
ఎందుకంటే.. ఈ సినిమా పై ఎన్నో పుకార్లు వస్తుండడంతో.. సంక్రాంతికి రిలీజ్ ఉంటుందా? ఉండదా? అని అనుకున్నారు. కానీ రీసెంట్గా ఓ బ్రాండ్ ప్రమోషన్స్ కోసం వచ్చిన మహేష్ బాబు.. గుంటూరు కారం సంక్రాంతికి వస్తుందంటే వస్తుందని చెప్పాడు. ఇక ఇప్పుడు షూటింగ్ కూడా జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. కాబట్టి సంక్రాంతికి మాస్ జాతర ఖాయమని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తుండగా.. హారిక హీసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.