రమణ గాడి మాస్ జాతర షురూ.. ‘గుంటూరు కారం’ బిగ్గెస్ట్ ఈవెంట్!
ఎట్టకేలకు మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. జనవరి 12న గుంటూరు కారం రిలీజ్‌కు రెడీ అవుతోంది. దీంతో బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటి వరకు గుంటూరు కారం స్లోగా నడిచింది గానీ.. ఇక నుంచి కాదని అంటున్నారు. సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో గుంటూరు కారం పై భారీ అంచనాలున్నాయి. అతడు, ఖలేజా తర్వాత త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమా కావడంతో.. ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి కాస్త డిలే అవుతూ వచ్చింది. ఫైనల్‌గా ఈ ఇయర్ ఎండింగ్‌తో షూటింగ్ కంప్లీట్ కానుంది. సినిమా రిలీజ్‌కు మరో 15 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో ప్రమోషన్స్ స్పీడప్ చేశారు మేకర్స్. ఇప్పటికే బీడితో త్రీడి చూపించిన మహేష్ బాబు.. లేటెస్ట్ లుక్స్‌లో మాత్రం చాలా కూల్‌గా సింపుల్‌గా కనిపిస్తున్నాడు. క్రిస్మస్ విష్ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేయడంతో పాటు.. ఒక మాస్ స్పైసీ సాంగ్ చేస్తున్నాం.. ఫ్లోర్‌పై మంటలు పుట్టించే డ్యాన్స్‌ను చూసేందుకు రెడీగా ఉండండి.. మహేష్, శ్రీలీల చితక్కొట్టేశారు.. అంటూ నాగవంశీ ట్వీట్ చేయడం హాట్ టాపిక్ అయింది.
అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్లో ఈ సాంగ్ షూటింగ్ జరుగుతోందని తెలిపారు. ఇదిలా ఉండగానే.. మరో సూపర్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో మహేష్ ఒక సెలబ్రేషన్ మోడ్‌లో కనిపిస్తూ వింటేజ్ వైబ్ గుర్తు చేస్తున్నాడు. ఇదిలా ఉండగానే.. బీడీ పట్టాడు, జనవరి 12 నుండి బాక్స్ ఆఫీస్ పని పడతాడు, ఈ సంక్రాంతికి బాబు మాస్ తాండవంతో కోనసీమ దద్దరిల్లుద్ది.. రమణ గాడి మాస్ జాతర.. రేపు ఉదయం 11:07 నిమిషాలకు సాలిడ్ అప్డేట్ ఉంటుందని.. బాబు బీడితో ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో ఇప్పటి నుంచి గుంటూరు కారం మొదలైపోయినట్టే. దాన్ని డబుల్ చేస్తూ.. భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్లాన్ చేస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని హైదరాబాద్ యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్ల్లో జనవరి 6న గ్రాండ్‌గా నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని చెప్తున్నారు. భారీ సంఖ్యలో ప్రీరిలీజ్ ఈవెంట్ వద్దకు మహేష్ ఫ్యాన్స్ తరలివస్తారని అంచనా వేస్తున్నారు. ఇదే వేదిక పై గుంటూరు కారం ట్రైలర్ లాంచ్ చేయనున్నారు. మరి ఈ సంక్రాంతికి మహేష్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేస్తుందో చూడాలి.