మెగాస్టార్ రీ ఎంట్రీ తరువాత వచ్చిన సినిమాలు అభిమానులకు సరిపోయేంత కిక్ ఇవ్వలేదు. అయితే తాజాగా చిరు చేస్తున్న వరుస ప్రాజెక్ట్లు మాత్రం అభిమానుల్లో ఉత్తేజాన్ని నింపుతున్నాయి. శ్రీకాంత్ ఓదెలతో సినిమాను ప్రకటించి ఊహించని బ్లాస్ట్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే వెంటనే అనిల్ రావిపూడితో కూడా మరో మూవీకి ఓకే చెప్పాడు. ఈ రెండు నిర్ణయాలతో ఆనందంలో ఉన్న అభిమానులకు మరో వార్త వినిపిస్తోంది. సందీప్ వంగతో సినిమా ఖరారు అయినట్లు తెలుస్తోంది.