బాలీవుడు హీరో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘రైడ్’. 2018లో విడుదలైన ఈ మూవీ భారీ వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమాకు స్వీక్వెల్‌గా ‘రైడ్-2’ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా 2025 మే 1న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి రాజ్‌కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. రితేష్ దేశ్‌ముఖ్, వాణికపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారు.