Naga Chaitanya : నాగ చైతన్య ‘కస్టడీ’ అసలైన వర్క్ స్టార్ట్!
Naga Chaitanya గతేడాది థ్యాంక్యూ, లాల్ సింగ్ చడ్డా సినిమాలతో ఆకట్టుకోలేకపోయిన అక్కినేని నాగ చైతన్య.. మంచి హిట్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నాడు. అందుకే ఈసారి మాస్ అటెంప్ట్ చేస్తున్నాడు. కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో కలసి 'కస్టడీ' అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో విలన్గా ఒకప్పటి హీరో అరవింద్ స్వామి నటిస్తున్నారు.
గతేడాది థ్యాంక్యూ, లాల్ సింగ్ చడ్డా సినిమాలతో ఆకట్టుకోలేకపోయిన అక్కినేని నాగ చైతన్య.. మంచి హిట్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నాడు. అందుకే ఈసారి మాస్ అటెంప్ట్ చేస్తున్నాడు. కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో కలసి ‘కస్టడీ’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో విలన్గా ఒకప్పటి హీరో అరవింద్ స్వామి నటిస్తున్నారు. ‘ధృవ’ తర్వాత అరవింద్ స్వామి చేస్తున్న స్ట్రెయిట్ తెలుగు సినిమా ఇదే. హీరోయిన్గా క్యూట్ బ్యూటీ కృతి శెట్టి నటస్తోంది. బంగార్రాజు తర్వాత నాగ చైతన్యతో కలిసి మరోసారి రొమాన్స్ చేస్తోంది. ఇప్పటికే ఆమె లుక్ రివీల్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలె ఈ సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. ఈ మేరకు మూవీ టీమ్ అంతా కలసి ఓ ఫన్ మేకింగ్ వీడియోను కూడా విడుదల చేశారు. సమ్మర్ కానుకగా మే 12న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక సినిమా రిలీజ్కు రెండు నెలల సమయమే ఉండడంతో.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్పీడప్ చేశారు. ఈ క్రమంలో తాజాగా.. కస్టడీ డబ్బింగ్ స్టార్ట్ అయినట్లు నాగ చైతన్య తన ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. అలానే అతి త్వరలో టీజర్ కూడా వస్తుందని తెలిపారు. ఇక ఈమూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రియమణి కీ రోల్ ప్లే చేస్తోంది. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కలిసి సంయుక్తంగా మ్యూజిక్ అందిస్తున్నారు. మరి తెలుగు, తమిళ బైలింగువల్ మూవీ నాగ చైతన్యకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.