chiru wedding card:చిరు-సురేఖ పెళ్లి జరిగి నేటికి 40 ఏళ్లు.. వెడ్డింగ్ కార్డ్ వైరల్
chiru wedding card:మెగాస్టార్ చిరంజీవికి (MegaStarChiranjeevi) సురేఖ (Surekha)తో 43 ఏళ్ళ క్రితం ఇదే రొోజున పెళ్లయ్యింది. 1980, ఫిబ్రవరి 20వ తేదీన చెన్నైలో గల రాజేశ్వరి కల్యాణ మండపంలో వివాహం జరిగింది. సురేఖ.. ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) కుమార్తె, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind)కు సోదరి అనే సంగతి తెలిసిందే.
chiru wedding card:మెగాస్టార్ చిరంజీవికి (MegaStarChiranjeevi) సురేఖ (Surekha)తో 43 ఏళ్ళ క్రితం ఇదే రోజున పెళ్లయ్యింది. 1980, ఫిబ్రవరి 20వ తేదీన చెన్నైలో గల రాజేశ్వరి కల్యాణ మండపంలో వివాహం జరిగింది. సురేఖ.. ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) కుమార్తె, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind)కు సోదరి అనే సంగతి తెలిసిందే. చిరంజీవి, సురేఖ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కుమారుడు కాగా.. ఇటీవల నిర్మాతగా మారిన సుష్మిత పెద్ద కూతరు.. చిన్న కూతురు శ్రీజ.
చిరు వెడ్డింగ్ యానివర్సరీ
చిరు వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా అభిమానులు విష్ చేస్తున్నారు. చిరు జంటకు పలువురు వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెబుతున్నారు. నిర్మాత సురేష్ కొండెటి ఈ మేరకు ట్వీట్ చేశారు. చిరంజీవి పెళ్లి పత్రిక (Chiranjeevi wedding card) షేర్ చేస్తున్నారు. ఇప్పుడు అదీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ప్రాణం ఖరీదు’ (Pranam Khareedu) సినిమా ద్వారా తెలుగు చలన చిత్రసీమలోకి చిరంజీవి అడుగు పెట్టారు. ముందు ఒప్పుకున్న సినిమా ‘పునాదిరాళ్ళు’ (Punadiraallu) అనే సంగతి తెలిసిందే. ఆ సినిమా కొంచెం ఆలస్యం అవటం వలన ‘ప్రాణం ఖరీదు’ ముందుగా విడుదల అయింది.
అల్లుడిగా చిరు
అప్పటికే చిరంజీవి గురించి, అతని కష్టపడే మనస్తత్వం గురించి అల్లు రామలింగయ్య తెలుసుకున్నారు. అతడిని అల్లుడిగా చేసుకుంటే బాగుంటుంది అనుకున్నారు. తన కూతురు సురేఖతో 1980 లో వివాహం జరిపించారు. చిరంజీవి అనతి కాలంలో స్టార్‌గా ఎదిగారు. తర్వాత వెనుదిరిగి చూడలేదు. తరువాత మెగాస్టార్ అయ్యారు.
చిరు ఫ్యామిలీ
ఆ తర్వాత అతని పెద్ద తమ్ముడు నాగబాబు నిర్మాతగా మారారు. చిన్న తమ్ముడు పవన్ కల్యాణ్ సినీ తెరంగ్రేటం చేసి అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నాడు. తర్వాత చిరు తనయుడు రాం చరణ్ తేజ ‘చిరుత’ మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చారు. చిరంజీవి అల్లుళ్లు సాయి ధరమ్ తేజ, వైష్ణవ్ తేజ కూడా సినిమాల్లోకి వచ్చారు. నాగబాబు కుమారుడు వరుణ్ తేజ కూడా ఇండస్ట్రీలోకి వచ్చాడు. నాగబాబు కూతురు నిహారిక కూడా ఒకటి అరా సినిమాల్లో నటించారు.