Ramcharan: బాలీవుడ్ స్టార్స్‌తో చరణ్ వెబ్ సిరీస్.. కానీ?
ఆ మధ్య మెగా పవర్ స్టార్ చరణ్ కూడా వెబ్ సిరీస్ చేయబోతున్నాడనే న్యూస్ వినిపించింది. కానీ ఇప్పటి వరకు దాని పై క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు సడెన్‌గా వెబ్ సిరీస్ ప్రోమోతో షాక్ ఇచ్చాడు చరణ్. అందులో దీపికా పదుకొనే, త్రిష, రణవీర్ సింగ్‌తో పాటు చరణ్ కూడా కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది.
ట్రిపుల్ ఆర్ తర్వాత గ్లోబల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్‌తో కలిసి ‘గేమ్ ఛేంజర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ సంక్రాతి లేదా సమ్మర్‌కు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేయబోతున్నాడు మెగా పవర్ స్టార్. ఇప్పటికే అఫిషీయల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. వీటితో పాటు హాలీవుడ్‌లోను ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు. ఆస్కార్ ప్రమోషన్స్‌లో భాగంగా హాలీవుడ్ ప్రాజెక్ట్ గురించి చెప్పుకొచ్చాడు చరణ్. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
ఇక బాలీవుడ్‌లోను చరణ్ మరోసారి లక్ చెక్ చేసుకునేందుకు రెడీ అవుతున్నట్టు వినిపిస్తునే ఉంది. ఖచ్చితంగా త్వరలోనే చరణ్ హిందీలో భారీ ప్రాజెక్ట్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అలాగే ఆ మధ్య చరణ్ కూడా వెబ్ సిరీస్ చేయబోతున్నాడనే న్యూస్ వినిపించింది. కానీ ఇప్పటి వరకు దాని పై క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు సడెన్‌గా వెబ్ సిరీస్ ప్రోమోతో షాక్ ఇచ్చాడు చరణ్. అందులో దీపికా పదుకొనే, త్రిష, రణవీర్ సింగ్‌తో పాటు చరణ్ కూడా కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే మొదట్లో ఈ ప్రోమో చూసినప్పుడు.. ఖచ్చితంగా వెబ్ సిరీస్‌లాగే అనిపిస్తుంది.
ఆ రేంజ్లో బిల్డప్ ఇచ్చారు సదరు మేకర్స్. కానీ ఖచ్చితంగా ఇది వెబ్ సరీస్ అయ్యే ఛాన్సే లేదు. మీషో సంస్థ కోసం బాలీవుడ్ స్టార్స్‌తో కలిసి చరణ్ ఓ యాడ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కానీ ముందుగా.. ఈ ప్రోమో చూసినప్పుడు యాడ్ అనే డౌట్ ఎక్కడ రాదు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అనేది తెలియాలంటే జూలై 5 వరకు ఆగాల్సిందే. ఇకపోతే.. రీసెంట్గా రామ్ చరణ్‌కి కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బ్రేక్ ఇచ్చిన గేమ్ ఛేంజర్ షూటింగ్ కొత్త షెడ్యూల్‌ను త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు.