కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. బీహార్ ప్రజలను కాంగ్రెస్ ఎలా ద్వేషించిందో ఎప్పటికీ మరవలేమని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో కాంగ్రెస్ను వ్యతిరేకించకుండా ఆర్జేడీ నిద్రపోతుందని ధ్వజమెత్తారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడ్డాయని తెలిపారు. వారంతా బయట రాష్ట్రాలకు వెళ్లకుండా తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నారని చెప్పారు.