CTR: ప్రత్యేక ప్రతిభావంతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథరెడ్డి పేర్కొన్నారు. పలమనేరు పట్టణంలోని బాలిక ఉన్నత పాఠశాలలో జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సుమారు 71.31 లక్షల విలువచేసే 1078( ట్రై సైకిల్లు, వినికిడి యంత్రాలు, వీల్ చైర్లు, వాకింగ్ స్టిక్స్ తదితర) పరికరాలను ఆయన చేతుల మీదుగా అందించారు.