అల్లుఅర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప-2 మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్ల మార్కును దాటింది. ఈ మైలురాయిని అత్యంత వేగంగా దాటిన భారత సినిమాగా చరిత్రకెక్కింది. మూవీ టీమ్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించింది. మూవీ రూ. 1508 కోట్లు కలెక్ట్ చేసి కమర్షియల్ సినిమా లెక్కల్ని, బాక్సాఫీస్ రికార్డుల్ని తిరగరాస్తోందని ప్రకటించింది.