‘ఆదిత్య 369’ మూవీ సీక్వెల్ గురించి హీరో బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో ‘ఆదిత్య 999’గా ఈ సినిమా రానుందని తెలిపారు. తన కుమారుడు మోక్షజ్ఞ తేజ ఈ చిత్రంలో హీరోగా నటించనున్నారని ప్రకటించారు. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కనుందని పేర్కొన్నారు. కాగా.. హనుమాన్ మూవీ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా మొదలు కాబోతున్న విషయం తెలిసిందే.