Allu Arjun : అభిమన హీరోలను చూడాలని, వారితో మాట్లాడాలని, ఫోటోలు దిగాలని కోరిక చాలా మంది అభిమానులకు ఉంటుంది. అయితే ఆ కల నిజమైన వేళ ఓ అభిమాని వెక్కి వెక్కి ఏడ్చాడు. తాజాగా అల్లు అర్జున్‌ని కలిసి, షేక్ హ్యాండ్ ఇచ్చిన ఓ అభిమాని కన్నీరు పెట్టుకున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. హైదరాబాద్‌లో అల్లు అర్జున్‌ని కలిసిన ఆ అభిమాని తన హీరో ఎదురుకుండానే కన్నీళ్లు కార్చేశాడు. ఓ రకంగా అవి ఆనంద బాష్పాలనే చెప్పాలి. అల్లు అర్జున్ చేయి పట్టుకుని హత్తుకుని మరీ ఏడ్చేశాడు.
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్‌కి(Allu Arjun) ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో ఎవ్వరికీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంతగా రియాక్ట్ అయిన అభిమానిని అల్లు అర్జున్ కూడా ఎంతో ప్రేమగా చూశారు. అభిమాని భుజంపై చేయి వేసి ఆప్యాయంగా ఓదార్చారు. ఎమోషనల్‌గా ఆ అభిమాని చెప్పినదంతా విన్నారు. అతడితో కలిసి ఫోటోలు దిగి ప్రోత్సహించారు. ఇలా వైరల్‌గా మారిన పోస్ట్‌పై అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అల్లు అర్జున్ డై హార్డ్ ఫ్యాన్స్ ఇలానే ఉంటారంటూ రాసుకొచ్చారు.
అభిమాన హీరోను మొదటి సారి కలిసినప్పుడు ఇలా ఎమోషనల్ అవ్వడం సహజమే