రానా దగ్గుబాటితో చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన డైరెక్టర్ తేజ.. ఆ తర్వాత ‘సీత’ సినిమాతో మెప్పించలేకపోయాడు. అందుకే కాస్త గ్యాప్ తర్వాత రానా తమ్ముడిని హీరోగా పరిచయం చేస్తూ.. మరోసారి సత్తా చాటాలని చూస్తున్నాడు. ఓ సరికొత్త కాన్సెప్ట్‌తో ‘అహింస’ అనే టైటిల్‌తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ దగ్గుబాటి హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో వరుస అప్ డేట్స్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే విడుదల చేసిన ప్రీ లుక్ టైటిల్ పోస్టర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఇక ఇప్పుడు అహింస నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఇందులో అభిరాం మొహాన్ని కవర్ చేస్తూ.. ఫారెస్ట్‌లో ఓ గ్యాంగ్ అతన్ని హింసకు గురి చేసినట్టు చూపించాడు. దాంతో అభిరామ్ లుక్ గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నాడని చెప్పొచ్చు. ఇక సినిమా టైటిల్ అహింస అయినప్పటికీ.. హింసతో మొదలు పెట్టి రివర్స్‌లో దానికి ఎండ్ కార్డ్ ఇచ్చేలా ఉన్నాడు తేజ. అంతేకాదు తేజ మార్కు యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఈ మూవీ ఉంటుందని తెలుస్తోంది. దాంతో కెరీర్ స్టార్టింగ్ నుంచి తన స్టైల్లో ప్రేమకథా చిత్రాలతో ఆకట్టుకున్న తేజ.. ఈ సారి కూడా కొత్తగానే ట్రై చేస్తున్నాడని చెప్పొచ్చు. గీతిక హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు.