అబ్బాస్.. ఈ పేరును అంత ఈజీగా మరిచిపోలేరు. ఒకప్పుడు అబ్బాస్‌ను మించిన అందగాడు లేడు అనేవారు. ముఖ్యంగా హెయిర్ స్టైల్ విషయంలో అబ్బాస్ తర్వాతే ఎవ్వరైనా అని చెప్పొచ్చు. ఇప్పటికీ అబ్బాస్ కటింగ్ చాలా ఫేమస్. గత కొంతకాలంగా లైమ్ లైట్లో లేకుండా పోయాడు అబ్బాస్. ఈ మధ్యే కొన్ని ఇంటర్వ్యూల్లో కనిపిస్తున్నాడు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.
Bigg Boss: బుల్లితెర రియాల్టీ షోలో బిగ్ బాస్ చాలా ఫేమస్. అన్ని భాషల్లో బిగ్ బాస్ షో పాపులర్ అయింది. తెలుగులో ఇప్పటి వరకు ఆరు సీజన్లు జరిగాయి. బిగ్ బాస్ సీజన్ 6 మాత్రం అసలు జరిగిందా.. అనే సందేహం రాక మానదు. ఎందుకంటే అంత చప్పగా సాగింది బిగ్ బాస్ 6. ఏదో షో ఉందంటే ఉంది అనేలా.. అసలు కంటెస్టెంట్స్ ఎవరనేది కూడా తెలియకుండా సాగిపోయింది. నాగార్జున హోస్ట్ చేసిన తెలుగు రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 6 ఓటిటిలో స్ట్రీమింగ్ అయింది. ఈ సీజన్లో రేవంత్ విజేతగా నిలిచాడు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ 7 సీజన్‌కు ఏర్పాట్టు జరుగుతున్నాయి. ఈసారి హోస్ట్‌గా నటసింహం బాలకృష్ణ పేరు వినిపించినప్పటికీ ఫైనల్‌గా నాగార్జుననే హోస్ట్ చేస్తన్నాడు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ 3 నుంచి ప్రారంభం కాబోతోంది. దీంతో ఈ సారి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎవరెవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇప్పటివరకు ఈ సీజన్లో సినీ నటి సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రీత, జబర్దస్త్ కమెడీయన్ నరేష్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇంకొందరి పేర్లు వినిపిస్తున్నా ఇంకా క్లారిటీ లేదు. ఇప్పుడు అలనాటి హీరో అబ్బాస్ కూడా బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య సోషల్ మీడియాలో అబ్బాస్ ఇంటర్వ్యూలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ గురించి అబ్బాస్ చెప్పిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సినిమాల్లో మాత్రం ఎంట్రీ ఇవ్వడం లేదు అబ్బాస్.
ఖచ్చితంగా అబ్బాస్‌ను అప్రోచ్ అయితే సినిమాల్లో నటించే ఛాన్స్ ఉంది. అంతకు ముందే బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదే నిజమైతే అబ్బాస్కిది టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. మరి ఇందులో నిజమెంతో చూడాలి.