ఇప్పటికే మెగా VS అల్లు అన్నట్లు సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ నడుస్తోంది. ఈ క్రమంలో దర్శకుడు RGV చేసిన ట్వీట్.. వాళ్ల ఫ్యాన్స్ మధ్య మరింత మంటపెట్టేలా ఉంది. ‘అల్లు.. మెగా కంటే చాలా రెట్లు ఎక్కువ. గ్లోబల్ స్టార్ కంటే ఎక్కువే.. అల్లుఅర్జున్ ప్లానెట్ స్టార్’ అని ట్వీట్ చేశారు. పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రభంజనాన్ని సృష్టించడం పక్కా.. అని పేర్కొన్నారు. సినిమా చరిత్రలో ఏ స్టార్ కూడా ఇంతటి ఉన్నత స్థాయికి చేరుకోలేదన్నారు.